High Court: ట్రాన్స్‌ఫర్మేటివ్ జస్టిస్ పుస్తకాన్ని రచించిన విశ్రాంత న్యాయమూర్తి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ శివశంకరరావు రచించిన ‘ట్రాన్స్‌ఫర్మేటివ్ జస్టిస్’ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజే అరూప్ కుమార్ గోస్వామి ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా, మంగళగిరిలో సెప్టెంబర్ 23న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ గోస్వామి మాట్లాడుతూ... న్యాయవాదులు, న్యాయమూర్తులకు ఉపయుక్తంగా జస్టిస్ డాక్టర్ బులుసు శివశంకరరావు మరిన్ని పుస్తకాలు రచించాలని ఆకాంక్షించారు. న్యాయవ్యవస్థలోని వివిధ అంశాలను వివరణాత్మకంగా ఈ పుస్తకం ద్వారా అందించారన్నారు. ఏపీ టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన కమిటీ(జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ) చైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. శివశంకరరావు 2019, సెప్టెంబర్ 14న బాధ్యతలు స్వీకరించారు.
చదవండి: రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న తొలి సాంకేతిక నిపుణులు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ శివశంకరరావు రచించిన ‘ట్రాన్స్‌ఫర్మేటివ్ జస్టిస్’ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజే అరూప్ కుమార్ గోస్వామి
ఎక్కడ : మంగళగిరి, గుంటూరు జిల్లా