RoNaldo New Deal : రొనాల్డో జాక్‌పాటు... వేల కోట్లతో కొత్త డీల్... వివరాలు తెలుసా
కెరీర్ చివరి దశలో ఉన్న 37 ఏళ్ల రొనాల్డో.. ఈ ఒప్పందంతో భారీ మొత్తమే జీతంగా పొందనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌తో సౌదీ క్లబ్.. ఈ సాకర్ దిగ్గజానికి ఏడాదికి 200 మిలియన్ యూరోలు.. అంటే మొత్తంగా 500 మిలియన్ యూరోలను... భారత కరెన్సీలో దాదాపు రూ.4400కోట్లకు పైమాటే చెల్లించనుంది. దీంతో ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యధిక ధర కలిగిన ఆటగాడిగా రొనాల్డో సరికొత్త రికార్డుసృష్టించనున్నాడు.
ఇటీవల మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో రొనాల్డో డీల్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఫిఫా ప్రపంచకప్ 2022 ప్రారంభానికి రెండు రోజుల ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. ఓ టాక్ షోలో రొనాల్డో.. మాంచెస్టర్ క్లబ్ యాజమాన్యం, మేనేజర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతడిపై వేటు వేసినట్లు క్రీడావర్గాలు పేర్కొంటున్నాయి. పోర్చుగల్ సీనియర్ జాతీయ జట్టుకు 2003లో ఎంపికైన రొనాల్డో అదే ఏడాది క్లబ్ కెరీర్‌ను ప్రారంభించాడు. దాదాపు నాలుగేళ్లపాటు మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు ఆడాడు. ఆ తర్వాత రియల్ మాడ్రిడ్, జువెంటస్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 14 ఏళ్ల తర్వాత 2021లో తిరిగి మాంచెస్టర్ క్లబ్‌కు వచ్చినప్పటికీ.. ఏడాదికే ఆ బంధం తెగిపోయింది.