Skip to main content

Hajj Pilgrimage: హజ్ యాత్రలో విషాదం.. వెయ్యి మందికి పైగా మృతి

ఈ సంవ‌త్స‌రం హజ్ యాత్రలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా 10 దేశాలకు చెందిన 1,081 మంది మరణించారు.
Hajj Pilgrimage Death Toll Climbs to Over 1,000 as Temperatures Hiked

ఈ విషాదంలో భారతీయులు 68 మంది మృతి చెందగా, 658 మంది మరణించిన ఈజిప్టు దేశస్తులు అత్యధికంగా ఉన్నారు.

జూన్ 20వ తేదీన ఒక్కరోజే ఈజిప్టుకు చెందిన 58 మంది మరణించినట్లు ఆ దేశ దౌత్యాధికారి ఒకరు వెల్లడించారు. మొత్తం మృతుల్లో 630 మంది వరకు అనధికారికంగా వచ్చిన వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం ఏసీ సౌకర్యాలను కల్పిస్తుంది. అనధికారికంగా వచ్చిన వ్యక్తులు ఎండల తీవ్రతను తట్టుకోలేక మరణిస్తున్నారని అధికారులు తెలిపారు.

Kuwait Building Fire: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం.. మృతుల్లో 42 మంది భారతీయులే!

Published date : 29 Jun 2024 10:15AM

Photo Stories