Skip to main content

Saudi Arabia: సౌదీలో తొలి మద్యం దుకాణం

మద్యపాన నిషేధాన్ని పాటించే సౌదీ అరేబియాలో మొట్టమొదటి సారిగా ఆల్కహాల్‌ విక్రయ కేంద్రం తెరుచుకోనుంది.
first liquor store in Saudi    Non-Muslim diplomatic alcohol hub debuts in Saudi Arabia

ముస్లిమేతర దౌత్యవేత్తల వినియోగం కోసం ఈ మద్యం స్టోర్‌ను తెరవనున్నారు. సంబంధిత మొబైల్‌ యాప్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకున్న మద్యం ప్రియులు మాత్రమే అక్కడ మద్యం కొనుగోలుచేసేందుకు అర్హులు. సౌదీ అరేబియా విదేశాంగ శాఖ దీనిని అనుమతులు ఇస్తుంది. నెలవారీ కోటా పరిమితి ప్రకారమే వినియోగదారులకు మద్యాన్ని విక్రయిస్తారు. పర్యాటకం, వాణిజ్యం ఊపందుకునేందుకు వీలుగా రియాద్‌ నగరంలో మద్యం అమ్మకాలు పెరగాలన్న సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆదేశాల మేరకే ఈ స్టోర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రియాద్‌లో వివిధ దేశాల ఎంబసీలు, రాయబార కార్యాలయాలకు నిలయమైన ప్రాంతంలో ఈ స్టోర్‌ను మరికొద్ది వారాల్లో ప్రారంభించనున్నారు.

Published date : 31 Jan 2024 09:57AM

Photo Stories