Skip to main content

Oscars 2023: ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో.. పది భారతీయ చిత్రాలు

ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌ వేడుక ఈ ఏడాది మార్చి 12న జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 301 చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్‌ పురస్కారాల కోసం పోటీ పడుతున్నాయి.

వాటిలో ఇండియా నుంచి 10 సినిమాలు ఆస్కార్‌ అవార్డుల నామినేషన్‌ బరిలో ఉన్నాయి. తొలి జాబితాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌ (తెలుగు), చెల్లో షో (గుజరాతీ), మీ వసంతరావ్‌ (మరాఠీ), తుజ్యా సాథీ కహా హై (మరాఠీ), ఇరవిన్ నిళల్‌ (తమిళ్‌)’ వంటి చిత్రాలు ఇప్పటికే ఆస్కార్‌ నామినేషన్స్‌ షార్ట్‌ లిస్ట్‌లో ఉన్నాయి. 
కాగా ఆస్కార్‌ అవార్డులకు పోటీపడేందుకు అవకాశం ఉన్న 301 చిత్రాల్లోని మిగతా జాబితాను అవార్డ్స్‌ కమిటీ జ‌న‌వ‌రి 10న వెల్లడించింది. అందులో ‘ది కశ్మీరీ ఫైల్స్‌’ (హిందీ), ‘గంగూబాయి కతియావాడి’ (హిందీ), ‘కాంతార’ (కన్నడ), ‘విక్రాంత్‌ రోణ’ (కన్నడ), ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ (తమిళ్‌)’ చిత్రాలు ఉన్నాయి. కాగా ఇండియా తరపున గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ ఆస్కార్‌ బరిలో నిలుస్తున్నట్టు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలు ఓపెన్‌ కేటగిరీలో నిలిచాయి.
ఇక ఏయే సినిమా ఏయే విభాగంలో పోటీ పడుతుందనే విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగం (‘నాటు నాటు.. పాట) లో షార్ట్‌ లిస్ట్‌లో నిలిచింది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతదర్శకుడు. అలాగే ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలోనూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షార్ట్‌లిస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. 
కాగా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో ‘కాంతారా’ ఎంపికైంది. రిషబ్‌ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇది.  అదే విధంగా సుదీప్‌ హీరోగా అనూప్‌ బండారి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ‘విక్రాంత్‌ రోణ’, సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘గంగుబాయి కతియావాడి’, వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన ‘ది కశ్మీరీ ఫైల్స్‌’ వంటివి ఉత్తమ చిత్రం కేటగిరీలో షార్ట్‌ లిస్టులో చోటు సంపాదించుకున్నాయి.  జ‌న‌వ‌రి 11 నుంచి ఓటింగ్ ప్రారంభం కానుంది. జ‌న‌వ‌రి 17 వరకు ఓటింగ్‌కు అవకాశం ఉంటుంది. షార్ట్‌ లిస్ట్‌లోని తుది నామినేషన్లను ఈ నెల 24న ప్రకటిస్తారు. 

☛ Top 10 Indian Movies 2022 : ఈ ఏడాది టాప్‌ 10 మూవీస్ ఇవే.. అగ్రస్థానంలో మ‌న తెలుగు మూవీ..

 

Published date : 11 Jan 2023 12:37PM

Photo Stories