Skip to main content

Spotlight Award: ఆర్‌ఆర్‌ఆర్‌కు హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అవార్డ్స్‌

హాలీవుడ్‌ గ్రౌండ్‌లో ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం..రణం..రుధిరం) సినిమా సౌండ్‌ ఓ రేంజ్‌లో వినిపిస్తోంది.

ఇప్పటికే ఈ ఏడాది న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ వారి బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డును సాధించారు దర్శకుడు రాజమౌళి. తాజాగా హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ జ్యూరీ స్పాట్‌లైట్‌ అవార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ప్రకటించింది. అలాగే అట్లాంటా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిలిచింది.
ఇక ‘ఫర్‌ యువర్‌ కన్సిడరేషన్‌’ కింద ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ యూనిట్‌ ఆస్కార్‌ అకాడమీకి అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 25న రిలీజై, ఘనవిజయం సాధించింది. కాగా 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌ నామినేషన్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు దక్కుతుందా? లేదా అనేది జనవరిలో నామినేషన్స్‌ ప్రకటన అప్పుడు తెలుస్తుంది. అవార్డుల వేడుక మార్చి12న జరగనుంది.

➤ చిరంజీవికి అరుదైన గౌరవం.. మోదీ ప్ర‌త్యేక అభినంద‌న‌లు

Published date : 07 Dec 2022 04:01PM

Photo Stories