SS Rajamouli: రాజమౌళికి ప్రతిష్ఠాత్మక అవార్డు
'ఆర్ఆర్ఆర్' చిత్రానికిగాను ఉత్తమ దర్శకుడిగా అమెరికాలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్(NYFCC) 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాకుగానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళిని ఎంపిక చేసింది. దీంతో ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకుడిగా ఆయన రికార్డు సృష్టించాడు. ‘ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ అవార్డును వార్తా పత్రికలు, మ్యాగజైన్స్, ఆన్‌లైన్ మీడియాకు సంబంధించిన ప్రముఖులు ఒక టీమ్‌గా ఏర్పడి 1935 నుంచి సినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అందజేస్తున్నారు. కాగా ఇటీవలే లాస్ ఏంజిల్స్ టైమ్స్ అనే ఇంగ్లీష్ పేపర్ రాజమౌళి గురించి ఫ్రంట్ పేజ్‌లో ఓ పెద్ద ఆర్టికల్ ప్రచురించడం విశేషం.
➤ చిరంజీవికి అరుదైన గౌరవం.. మోదీ ప్రత్యేక అభినందనలు
ఫిబ్రవరి 25,2022 విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సంచలనం విజయం సాధించింది. ఓవరల్‌గా 1200కోట్లకు పైగా కలెక్షన్‌లు సాధించి రాజమౌళికి వరుసగా రెండోసారి 1000 కోట్ల క్లబ్‌లో నిలిచిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అలరించిన ఈ సినిమా ఇప్పటికే శాటర్న్, సన్‌సెట్ సర్కిల్ వంటి పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుంది. మరోవైపు ఈ సినిమా దాదాపు 14 విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్ బరిలో పోటీ పడనుంది.
➤ సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు.. ఈయన కెరీర్‌ను మలుపుతిప్పింది ఇక్కడే..