Skip to main content

RRR Natu Natu Song: 17 రోజుల కష్టం.. రూ.15 కోట్ల బడ్జెట్.. ఫ‌లితం ఆస్కార్

‘నాటు నాటు’ పాటను ఉక్రెయిన్‌లో చిత్రీకరించారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భవన ప్రాంగణంలో ఈ పాటను షూట్‌ చేశారు.
Jr.ntr-RamCharan

పక్కనే పార్లమెంట్‌ భవనం కూడా ఉంది. అయితే ఇలాంటి ప్రదేశంలో ఓ సినిమా షూటింగ్‌ అంటే చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ జెలెన్‌స్కీ ఒకప్పుడు టెలివిజన్‌ యాక్టర్‌ అట. సో.. ఆర్ట్‌ గురించి ఆయనకు అవగాహన ఉండటంతో పాటను చిత్రీకరించేందుకు అనుమతి ఇచ్చారు. ‘నాటు నాటు’ పాటను 17 రోజుల పాటు షూట్‌ చేశారు. సెట్స్‌లో ప్రతి రోజూ 150మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. 200మంది సాంకేతిక నిపుణులు ఈ పాట కోసం లొకేషన్‌లో హాజరయ్యారు. 
ఇక ఈ పాటలో ‘హుక్‌ స్టెప్‌’ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది. దాదాపు 80 రకాల స్టెప్స్‌ను కంపోజ్‌ చేశాక ఈ పాట కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ అండ్‌ టీమ్‌ ఆ స్టెప్‌ను ఫైనలైజ్‌ చేశారు. ఈ స్టెప్‌ కూడా ఊరికే పూర్తి కాలేదు. డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు 18 టేక్స్‌ తీసుకున్నారు. ఎన్టీఆర్, చరణ్‌ల మధ్య సింక్‌ రావడానికి ఎక్కువ సమయం పట్టిందట. ఇలా వీరందరి కష్టం ఇప్పడు ఆస్కార్‌ అవార్డు రూపంలో ఫలించింది.

Oscar Awards 2023 Winners Details Telugu : అస్కార్‌ విజేతలు 2023 వీరే..  

దాదాపు రూ.15 కోట్లు ఖ‌ర్చు..
ఈ పాట కోసం దాదాపు రూ. 15 కోట్లు అయింది. నిజానికి ఈ పాటను ముందుగా ఇండియాలోనే షూట్‌ చేయాలనుకున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట లొకేషన్‌ను అనుకున్నారు. కానీ ఆ సమయానికి వర్షాకాలం కావడంతో ఇతర దేశాల్లో తీయాలనుకున్నారు రాజమౌళి. సెట్‌ అయితే సహజంగా ఉండదని భావించారు. ఆ సమయంలోనే జెలెన్‌స్కీ భవనం లొకేషన్‌ రాజమౌళి కంట పడింది. అక్కడే పాటను చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ అనుమతులు దొరకవని అనుకున్నారు. అయితే ఉక్రెయిన్‌ టీమ్‌ వల్ల అది సాధ్యమైంది. అలాగే పాట సమయంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పాటు సైడ్‌ డ్యాన్సర్స్‌కు కూడా రెండు, మూడు కాస్ట్యూమ్స్‌ను రెడీగా ఉంచారు. ఎందుకంటే సాంగ్‌ను దుమ్ములో తీశారు. కాస్ట్యూమ్స్‌ పాడైతే షూటింగ్‌ లేట్‌ అవుతుందని. ఈ సినిమాకు రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వర్క్‌ చేశారు.
ఎన్టీఆర్ ఏమ‌న్నారంటే..
భారతదేశం చాలా బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్న వైవిధ్యమైంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో మీరు చూసింది అదే. ప్రపంచానికి చెప్పాల్సిన కథలు ఇండియాలో చాలా ఉన్నాయి. చాలా తీవ్రమైన, బలమైన, భావోద్వేగ, నాటకీయ యాక్షన్‌తో కూడిన సినిమాలు ఇండియా నుంచి వస్తాయి. ఇప్పుడు భారతీయులకు పూర్తి నమ్మకం కలిగింది.
రామ్‌చరణ్ ఏమ‌న్నారంటే.. 
మనం గెలిచాం. మన సినిమా గెలిచింది. యావత్‌ దేశమే గెలిచింది. ఆస్కార్‌ను ఇంటికి తెచ్చేస్తున్నాం. మా జీవితాల్లోనే కాకుండా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎంతో ప్రత్యేకమైనది. ఆస్కార్‌ అవార్డు సొంతమయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌. నేనింకా కలలోనే ఉన్నట్లు అనిపిస్తోంది. రాజమౌళి, కీరవాణిగార్లు భారత చలనచిత్రపరిశ్రమలో అత్యంత విలువైన రత్నాలు. ఈ అద్భుత కళాఖండంలో నన్ను భాగం చేసినందుకు కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా ‘నాటు నాటు’ అనేది ఒక భావోద్వేగం. ఆ భావోద్వేగానికి రూపమిచ్చిన చంద్రబోస్, రాహుల్‌ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్‌రక్షిత్‌లకు థ్యాంక్స్‌. నా బ్రదర్‌ ఎన్టీఆర్, కో స్టార్‌ ఆలియాభట్‌కు థ్యాంక్స్‌. తారక్‌.. కుదిరితే నీతో మళ్లీ డ్యాన్స్ చేసి రికార్డులు సృష్టించాలనుంది. ఈ అవార్డు భారతీయ నటీనటులు, సాంకేతిక నిపుణులందరి సొంతం. 

Oscar Awards: ఆస్కార్ అందుకున్న భార‌తీయులు ఎంత మందో తెలుసా.. అందుకే ఈ అవార్డుల‌కు అంత క్రేజ్‌.!

Published date : 14 Mar 2023 12:13PM

Photo Stories