Skip to main content

Oscar Awards: ఆస్కార్ అందుకున్న భార‌తీయులు ఎంత మందో తెలుసా.. అందుకే ఈ అవార్డుల‌కు అంత క్రేజ్‌.!

ఆస్కార్‌.. ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్ర‌పంచ సినీ ప‌రిశ్ర‌మ‌లో న‌టించే ప్ర‌తి ఒక్క‌రూ త‌మ జీవితంలో ఏదో ఒక రోజు ఆస్కార్ అందుకోవాల‌ని క‌ల‌లు కంటుంటారు. ఈ అవార్డుల్లో అధిక‌శాతం హాలీవుడ్ సినిమాలు, నటీన‌టుల‌కే ద‌క్కుతుంటాయి.
Oscar Awards

అయితే ఆస్కార్ అందుకున్న భార‌తీయులు ఎంత‌మందో మీకు తెలుసా.? మ‌రో నాలుగు రోజుల్లో(మార్చి 12న‌) లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న 95వ ఆస్కార్‌ వేడుకల సందర్భంగా ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
గాంధీ సినిమాకు గాను....
భారత తొలి ఆస్కార్‌ విజేతగా భాను అథైయా చరిత్ర పుటల్లో నిలిచారు. 1983లో నిర్వహించిన 55వ ఆస్కార్‌ వేడుకల్లో ఆమె అవార్డు అందుకున్నారు. 1982లో విడుదలైన ‘గాంధీ’ సినిమాకి బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ విభాగంలో అవార్డును అందుకున్నారు. ఈ సినిమా ద‌ర్శ‌కుడితో పాటు అధిక‌శాతం మంది న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు, చిత్ర స‌భ్యులు అంతా బ్రిట‌న్‌కు చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఆ త‌ర్వాత వ‌చ్చిన ల‌గాన్ సినిమాకు భాను నే కాస్ట్యూమ్స్ రూపొందించారు.

చ‌ద‌వండి: ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ఉచితంగా చ‌దువు.. అయితే వీరికి మాత్ర‌మే
స‌త్య‌జిత్ రేకు గౌర‌వ పుర‌స్కారం

సత్యజిత్ రే... భార‌త చ‌ల‌న‌చిత్రానికి ఓ రోల్ మోడ‌ల్. పథేర్‌ పాంచాలి, అపరాజితో, పరశ్‌ పాథర్‌, దేవి, అపూర్‌ సన్‌సార్ ఇలా 36 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. సినిమాకు సంబంధించిన ప్రతి విభాగంలో ఆయన నిష్ణాతుడు. సినీ రంగానికి సత్యజిత్‌ రే చేసిన విశేష సేవలను గుర్తించిన అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్ 1992లో ఆయనకు గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు ఆయనే.
17 ఏళ్ల త‌ర్వాత‌...
2009లో జరిగిన 81వ ఆస్కార్‌ వేడుకలో ఏకంగా మూడు ఆస్కార్‌ అవార్డులు.. ముగ్గురు భారతీయులకు ద‌క్కాయి. స్లమ్‌డాగ్‌ మిలీనియర్‌ చిత్రానికి బెస్ట్‌ సౌండింగ్‌ మిక్సింగ్‌ కేటగిరీలో రసూల్‌.. రిచర్డ్‌ ప్రైక్‌, ఇయాన్‌ ట్యాప్‌తో కలిసి ఆస్కార్‌ పురస్కారం స్వీకరించారు. ముసాఫిర్‌ (హిందీ) సినిమాతో 2004లో సినీ కెరీర్‌ను ప్రారంభించిన రసూల్‌ తమిళ్‌, మలయాళం, కన్నడ, తెలుగు (పుష్ప, రాధేశ్యామ్‌) చిత్రాలకు సౌండ్‌ మిక్సింగ్‌ చేశారు.

చ‌ద‌వండి:​​​​​​​ నీట్‌ (యూజీ) నోటిఫికేషన్ విడుద‌ల‌... ఇలా అప్లై చేసుకోండి
బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌లో..
స్లమ్‌డాగ్‌ మిలీనియర్ సినిమాలోని జయహో పాట‌కు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఎంపికైంది. ఈ పాటను ర‌చించిన గుల్జార్ కు ఆస్కార్ ద‌క్కింది.
రెండు విభాగాల్లో రెహమాన్‌..
సంగీత ప్రియులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఎ. ఆర్‌. రెహమాన్‌. రెండు అకాడమీ అవార్డులు గెలుచుకున్న తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రానికిగానూ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ (జయహో), బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాల్లో ఆయన ఆస్కార్‌ అందుకున్నారు.
ఉత్తమ డాక్యుమెంటరీ..
ఢిల్లీకి చెందిన నిర్మాత గునీత్‌ మోన్గా నిర్మించిన పీరియడ్‌. ఎండ్‌ ఆఫ్‌ ఏ సెంటెన్స్‌ ఉత్తమ డాక్యుమెంటరీగా 2019లో ఆస్కార్‌ గెలుచుకుంది. అయితే ఈ ఏడాది మార్చి 13న జ‌ర‌గ‌నున్న 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు ఆల్‌ దట్‌ బ్రెత్స్‌ (ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగం), ది ఎలిఫెంట్‌ విస్ఫరర్స్‌ (ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ విభాగం), నాటు నాటు (ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో) ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ఈ మూడింటికి అవార్డులు రావాల‌ని ఆకాంక్షిద్దాం. 

Published date : 08 Mar 2023 03:33PM

Photo Stories