Education News: ఇలా చేస్తే ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా చదువుకోవచ్చు.. అయితే వీరికి మాత్రమే
ఇందులో భాగంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాలకు చెందిన వారు (అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధిత పిల్లలు, దివ్యాంగుల) కోసం 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాల(బీసీ, మైనారిటీ, ఓసీ)కు చెందిన పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయించనున్నట్లు వివరించారు.
చదవండి: వణికిస్తోన్న ఇన్‌ఫ్లుయెంజా... ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే...
వార్షిక ఆదాయం ఆధారంగానే...
రాష్ట్రంలోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో అర్హత కలిగిన పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించి 2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు వార్షిక ఆదాయం రూ.1,20,000, పట్టణ ప్రాంతంలో నివసించే బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు వార్షికాదాయం రూ.1,44,000లను ప్రాతిపదికగా తీసుకుని వారి కుటుంబాల పిల్లలను అర్హులుగా పరిగణిస్తామని పేర్కొన్నారు.
చదవండి: ఇంటర్ హాల్ టికెట్లు వచ్చేశాయ్... ప్రిన్సిపల్ సైన్ లేకపోయినా...
25 శాతం కచ్చితంగా....
ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాల కల్పనకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు వెల్లడించారు. ఒకటో తరగతిలో ప్రవేశం కోసం ఆన్‌లైన్ దరఖాస్తు నమోదుకు షెడ్యూల్ కూడా ప్రకటించామన్నారు. అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు, అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్(సమగ్ర శిక్ష) దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.
విద్యార్థుల ప్రవేశాలకు షెడ్యూల్ ఇలా...
- ఆన్‌లైన్ పోర్టల్‌లో అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల నమోదు తేదీలు: 06.03.2023 నుంచి 16.03.2023 వరకు
- విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు (ఆన్‌లైన్ పోర్టల్‌లో) తేదీలు: 18.03.2023 నుంచి 07.04.2023 వరకు
- ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక ప్రక్రియ: 09.04.2023 నుంచి 12.04.2023 వరకు
చదవండి: నీట్ (యూజీ) నోటిఫికేషన్ విడుదల... ఇలా అప్లై చేసుకోండి
- మొదటి ఎంపిక జాబితా విడుదల తేదీ: 13.4.2023
- ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో మొదటి జాబితాలో ఎంపిక కాబడిన విద్యార్థుల ప్రవేశాలను నిర్థారించే తేదీలు: 15.04.2023 నుంచి 21.04.2023 వరకు
- రెండో ఎంపిక జాబితా విడుదల తేదీ: 25.4.2023
- రెండో జాబితాలో ఎంపికైన విద్యార్థుల ప్రవేశాలను నిర్థారించే తేదీలు: 26.04.2023 నుంచి 30.04.2023 వరకు