Skip to main content

Junior NTR: మోస్ట్ పాపుల‌ర్ యాక్ట‌ర్‌గా జూనియ‌ర్‌ ఎన్టీఆర్‌.. టాప్ 10 యాక్ట‌ర్స్ వీరే..

టాలీవుడ్ మోస్ట్ పాపుల‌ర్ మేల్ యాక్ట‌ర్ల జాబితాలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మెద‌టి స్థానంలో నిలిచారు.
NTR Becomes The Most Popular Actor In Tollywood

తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా మార్చి 1 నుంచి 12 మ‌ధ్య చేసిన స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. ఇందులో యంగ్ టైగ‌ర్ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా మెగా ప‌వ‌ర్‌స్టార్‌ రామ్ చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, ప‌వ‌ర్‌స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మెగాస్టార్ చిరంజీవి, నాచుర‌ల్‌స్టార్ నాని, నంద‌మూరి బాల‌క‌`ష్ణ‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఉన్నారు.

కాగా దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటునాటు’ పాట ఆస్కార్‌ అవార్డును గెలుపొందింది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో హాలీవుడ్‌ సాంగ్స్‌ను వెనక్కి నెట్టి తెలుగు పాట విజేతగా అవతరించింది. భారతీయ పాటకు అందులోనా ఓ తెలుగు సాంగ్‌కు ఆస్కార్‌ రావడం ఇదే మొదటిసారి. ఈ పాట‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ స్టెప్పులేసి అంద‌రినీ మెప్పించారు.

RRR Natu Natu Song: 17 రోజుల కష్టం.. రూ.15 కోట్ల బడ్జెట్.. ఫ‌లితం ఆస్కార్

Published date : 15 Mar 2023 11:18AM

Photo Stories