Skip to main content

RRR: ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో ‘ఆర్‌ఆర్ఆర్’ నాటు నాటు సాంగ్

ఆస్కార్‌... ప్రపంచంలోని సినిమా అవార్డుల్లో ప్రతిష్టాత్మకమైనది. ఈసారి తెలుగు నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ బరిలో ఉంది.

ఆస్కార్‌ అవార్డు కోసం పోటీ పడుతున్న కేటగిరీల్లో పది కేటగిరీలకు సంబంధించిన ‘షార్ట్‌లిస్ట్‌’ను డిసెంబ‌ర్ 22న‌ ఆస్కార్‌ కమిటీ ప్రకటించింది. మొత్తం నాలుగు విభాగాల్లో భారతీయ చిత్రాలు నామినేషన్‌ బరిలో చోటు దక్కించు కున్నాయి. భారత చలన చిత్ర చరిత్రలో ‘షార్ట్‌లిస్ట్‌’లో నాలుగు చిత్రాలు నిలవడం ఇదే తొలిసారి. ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటు నాటు..’ పాట, ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ‘ది ఛెల్లో షో’ (ద లాస్ట్‌ ఫిల్మ్‌), ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్‌’ చిత్రాలు నిలిచాయి. 

14 పాటలతో ‘నాటు నాటు’ పోటీ 
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు కూడా సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ప్రత్యేకించి ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ నృత్యాలు సమకూర్చిన ‘నాటు నాటు’ పాటలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టారు. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో మొత్తం 81 పాటలు బరిలో నిలవగా ఫైనల్‌గా 15 పాటలు మాత్రమే షార్ట్‌లిస్ట్‌లో చేరాయి. అందులో ‘నాటు నాటు’ పాటకి చోటు దక్కింది. భారత చలన చిత్ర చరిత్రలో షార్ట్‌లిస్ట్‌లో నిలిచిన తొలి పాట ఇదే. షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకు ఓటింగ్‌ నిర్వహించి, నామినేషన్‌ దక్కించుకున్న చిత్రాల వివరాలను జనవరి 24న ప్రకటిస్తారు. మార్చి 12న లాస్‌ ఏంజిల్స్‌లో ఆస్కార్‌ అవార్డుల ప్రదానం జరుగుతుంది.    

Weekly Current Affairs (Awards) క్విజ్ (18-24 నవంబర్ 2022)

Published date : 23 Dec 2022 11:54AM

Photo Stories