Skip to main content

TS EAMCET Results 2023 Date: టీఎస్ ఎంసెట్ ఫ‌లితాల విడుద‌ల మే 25న... డైరెక్ట్ లింక్ ఇదే

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఎంసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్) ప్రాథమిక ‘కీ’ తో పాటు రెస్పాన్స్ షీట్లుల‌ను కూడా మే 14వ తేదీ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
ts eamcet results 2023 news telugu
ts eamcet results 2023

అలాగే టీఎస్ ఎంసెట్ ఫ‌లితాల‌పై (TS EAMCET Results) కీల‌క స‌మాచారం వ‌చ్చింది. టీఎస్ ఎంసెట్ ఫ‌లితాలను మే 25న విడుదల చేయనున్నారు. TS EAMCET Results 2023 కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

☛ Engineering‌ Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోస‌మే!

ఈ భారీగా ప‌రీక్ష‌కు హాజ‌రు..

ఈసారి టీఎస్ ఎంసెట్‌కు  భారీగా దరఖాస్తులొచ్చాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్‌లో నూ ఇదే ట్రెండ్‌ కన్పిస్తోంది. రెండు విభాగాలకు కలిపి 3,20,310 మందికి పైగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇందులో తెలంగాణకు చెందినవి 2,48,146, ఏపీవి 72,164 ఉన్నాయి. గత సంవత్సరం (2022) మొత్తం 2,66,714 దరఖాస్తులే రావడం గమనార్హం. కాగా ఈ ఏడాది అనూ హ్యంగా 53,224 దరఖాస్తులు (20%) పెరిగాయి.

Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

అలాగే టీఎస్ ఎంసెట్ ప‌రీక్ష‌కు కూడా ఈ భారీ సంఖ్య విద్యార్థులు హాజ‌రయ్యారు.ఎంసెట్‌కు మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ అండ్‌ మెడికల్ పరీక్షను.. ఇక మే 12-14 మధ్య ఇంజినీరింగ్ పరీక్షలు జరిగిన విష‌యం తెల్సిందే. 

టీఎస్ ఎంసెట్ ఫ‌లితాలు మాత్రం..

ts eamcet results 2023 latest news telugu

మే 25 ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేర‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ స్ట్రీమ్ టెస్ట్‌ల ప్రిలిమినరీ 'కీ'లపై విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలను నిపుణుల బృందం పరిశీలిస్తుంది. 

☛ చదవండి: ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో ఈ సాఫ్ట్‌వేర్ కోర్సులదే హవా..

దీని తరువాత, తుది కీ రూపొందిస్తారు. మొత్తం ఐదు రోజుల పాటు పలు సెషన్ లలో నిర్వహించిన పరీక్షలు కాబట్టి ఫలితాల వెల్లడించడానికి కాస్త సమయం పడుతుంది. ఎంసెట్ ఫలితాలు మే 26 -30 తేదీల మధ్య ప్రకటించే అవకాశం ఉందని ఎంసెట్ నిర్వహణ వర్గాలు తెలిపాయి. .TS EAMCET Results 2023 కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

☛ చదవండి: బీటెక్‌లో ఈఈఈతో భవిష్యత్తుకు భరోసా ఉంటుందా.. తెలుసుకోండిలా..

How to check TS EAMCET 2023 Results:
☛ Visit results.sakshieducation.com or sakshieducation.com
☛ Click on TS EAMCET 2023 Results link available on the home page
☛ In the next page, enter your hall ticket no. and click on submit
☛ The results will be displayed on the screen
☛ Save a copy of the marks sheet for further reference

ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ లేకపోవడంతో ఇంటర్‌, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ఫలితాల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. విద్యార్థుల ఎంసెట్‌ మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు.

TS EAMCET 2023 Marks Vs Rank

Published date : 23 May 2023 04:31PM

Photo Stories