TS EAMCET Preliminary Key 2023 : టీఎస్ ఎంసెట్ ‘కీ’ తో పాటు రెస్పాన్స్ షీట్లు విడుదల.. అలాగే ఫలితాలను కూడా..
మే 10, 11 తేదీల్లో మొత్తం నాలుగు సెషన్లల్లో ఈ పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. ఎంసెట్ రాసిన విద్యార్థులు ప్రాథమిక ‘కీ’ పై ఏమైనా అభ్యంతరాలు ఉండే అధికార వెబ్‌సైట్ https://eamcet.tsche.ac.in/ లో మే 14వ తేదీ నుంచి మే 16వ తేదీ సాయంత్రం 6:00 గంటలలోపు తెలిపవచ్చును. తుది ‘కీ’ని కూడా త్వరలోనే వెల్లడించి.. ఫలితాల ప్రక్రియను ప్రారంభిస్తారు.
☛ TS EAMCET (AM) 2023 (PRELIMINARY KEY) (Click Here)
☛ TS EAMCET (AM) 2023 (RESPONSE SHEETS) (Click Here)
☛ TS EAMCET (AM) 2023 (OBJECTIONS ON KEY) (Click Here)
టీఎస్ ఎంసెట్ ఫలితాలు ఎప్పుడంటే..?
టీఎస్ ఎంసెట్ ఫలితాలను రెండు వారాల్లో ప్రకటించనున్నారు. ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ లేకపోవడంతో ఇంటర్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ఫలితాల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. విద్యార్థుల ఎంసెట్ మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు.
చదవండి: బీటెక్‌లో ఈఈఈతో భవిష్యత్తుకు భరోసా ఉంటుందా.. తెలుసుకోండిలా..
☛ Engineering Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోసమే!
TS EAMCET 2023 Marks Vs Rank
క్రేజ్ కూడా కారణం ఇదే..
జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జేఈఈ రాయాల్సి ఉంటుంది. ఇందులో ర్యాంకు రావాలంటే బాగానే కష్టపడాలి. ముమ్మర కోచింగ్ తీసుకోవాలి. ఇంతా చేసి సాధారణ ర్యాంకు వస్తే కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు లభించడం కష్టం. ఈ కారణంగానే ఇంటర్ ఉత్తీర్ణుల్లో సగానికిపైగా జేఈఈ వైపు వెళ్ళడం లేదు. ఎలాగైనా కంప్యూటర్ సంబంధిత ఇంజనీరింగ్ కోర్సు చేయాలనుకుంటున్న వారు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎంసెట్‌కు 3 లక్షల మంది దరఖాస్తు చేస్తే, జేఈఈకి 1.40 లక్షల మందే దరఖాస్తు చేయడం గమనార్హం.
చదవండి: ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో ఈ సాఫ్ట్‌వేర్ కోర్సులదే హవా..
మరోవైపు విద్యార్థుల అభిమతానికి అనుగుణంగా రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ట్రెండ్ మార్చాయి. సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రి కల్ విభాగాల్లో సీట్లు తగ్గించుకుంటున్నాయి. వీటి స్థానంలో సీఎస్‌సీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సుల్లో సీట్లు పెంచుకుంటున్నాయి. దీంతో ఎంసెట్‌లో అర్హత సాధిస్తే ఏదో ఒక కాలేజీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు అనువైన కంప్యూటర్ కోర్సు సీటు వస్తుందని విద్యార్థులు భావిస్తున్నారు.ఎంసెట్‌కు దరఖాస్తులు పెరగడానికి ఇది కూడా ఒక కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి.
చదవండి: బీటెక్‌లో ఈసీఈతో బంగారు భవిత అందుకోండి.. కెరీర్‌లో దూసుకెళ్లండి..
చదవండి: ఎవర్‌గ్రీన్ సివిల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు ఇలా..