EAMCET 2023: ఇంజనీరింగ్ ప్రధాన బ్రాంచీల్లో సీట్ల భర్తీ ఇలా..
దీంతో ఇప్పటివరకూ 70,627 సీట్లను ఎంసెట్ అర్హులతో భర్తీ చేశారు. 16 యూనివర్సిటీలు, రెండు ప్రైవేటు వర్సిటీలు, 156 ప్రైవేటు కాలేజీలు కలిపి మొత్తం 174 ఇంజనీరింగ్ కాలేజీల్లో 83,766 సీట్లు అందుబాటులో ఉండగా..తాజా కేటాయింపు అనంతరం ఇంకా 13,139 సీట్లు మిగిలిపోయాయి. ఈ సీట్లను, తుది విడత కౌన్సెలింగ్ తర్వాత విద్యార్థులు చేరకుండా మిగిలిపోయే సీట్లను ఈ నెల 17న ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు.
తుది విడతలో 35,757 మంది విద్యార్థులు 3,06,820 ఆప్షన్లు ఇచ్చారు. 30 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 5,400 మందికి ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు కేటాయించారు. సీట్లు వచ్చిన విద్యార్థులు గురువారం ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం గానీ లేదా 12వ తేదీలోగా కాలేజీకి వెళ్లి అన్ని సర్టిఫికెట్లు, సీటు కేటాయింపు పత్రాన్ని సమర్పించి సీట్లు ఖరారు చేసుకోవాలని అధికారులు సూచించారు.
చదవండి: ఇంజనీరింగ్ - జాబ్ గైడెన్స్ | ప్రాజెక్ట్ గైడెన్స్ | సక్సెస్ స్పీక్స్ | గెస్ట్ స్పీక్స్ | న్యూస్
కంప్యూటర్ సీట్లన్నీ భర్తీ
దాదాపు మూడొంతుల సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోనే భర్తీ అయ్యాయి. మొత్తం 83,766 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఇందులో 56,811 సీట్లు కంప్యూటర్ బ్రాంచీల్లోనే ఉన్నాయి. ఇప్పటివరకూ భర్తీ చేసిన సీట్లలో కంప్యూటర్ బ్రాంచ్‌ల్లోనే 53,034 సీట్లు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, నెట్‌వర్క్, సీఎస్‌ఈ ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచీల్లో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి.
సీఎస్‌సీలో 22,845 సీట్లు భర్తీ కాగా 966 సీట్లు మాత్రమే మిగిలిపోయాయి. ఐటీ బ్రాంచీలో 5,324 సీట్లకు 5,131 సీట్లు మూడో విడత కౌన్సెలింగ్ తర్వాత భర్తీ చేశారు. ఈ బ్రాంచీలో 193 సీట్లు మాత్రమే మిగిలాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాటి అనుబంధ బ్రాంచీల్లో 17,567 సీట్లు ఉంటే, 13,417 మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 4,150 సీట్లు మిగిలాయి. సివిల్, మెకానికల్ వాటి అనుబంధ బ్రాంచీల్లో భారీగా సీట్లు మిగిలిపోయాయి. 8,187 సీట్లు ఉంటే, 3,457 సీట్లు భర్తీ అయితే, ఇంకా 4,730 సీట్లు మిగిలిపోయాయి.
మూడో విడత కౌన్సెలింగ్ తర్వాత ఇంజనీరింగ్ ప్రధాన బ్రాంచీల్లో సీట్ల భర్తీ ఇలా..
బ్రాంచ్ |
ఉన్న సీట్లు |
భర్తీ చేసినవి |
మిగిలినవి |
భర్తీ శాతం |
కంప్యూటర్ బ్రాంచీలు |
56,811 |
53,034 |
3,777 |
93.35 |
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ |
17,567 |
13,417 |
4,150 |
76.38 |
సివిల్, మెకానికల్ |
8,187 |
3,457 |
4,730 |
42.23 |
ఇతర బ్రాంచీలు |
1,209 |
719 |
490 |
59.47 |
మొత్తం |
83,766 |
70,627 |
13,139 |
84.31 |