Skip to main content

బీటెక్‌లో ఈసీఈతో బంగారు భవిత అందుకోండి.. కెరీర్‌లో దూసుకెళ్లండి..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎలక్ట్రానిక్ వస్తువు లేకుండా బయటికి వెళ్లలేని పరిస్థితి ఉంది. నిత్య జీవితంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, కమ్యూనికేషన్, సమాచారం ఒక భాగంగా మారిపోయింది.
సమాచార సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. ఇలాంటి ఎన్నో మార్పులకు మూలం.. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలు. వీటిని లోతుగా అధ్యయనం చేసే బ్రాంచ్.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ఈసీఈ). ప్రస్తుతం విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో ఈసీఈ ఒకటి. ఈసీఈ పూర్తి చేసిన అభ్యర్థులు ఇటు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సంస్థలతోపాటు అటు ఐటీ రంగంలోనూ ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు.

ఉన్నత చదువు: ఈసీఈలో బీఈ/బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులు ఉన్నత చదు వులు, పరిశోధనల వైపు ఆసక్తి ఉంటే.. గేట్ ద్వారా ఐఐటీలు, ఎన్‌ఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఎంటెక్/ఎంఈ, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు పొందవచ్చు. విదేశాల్లో మాస్టర్స్ చేయాలనుకునే అభ్యర్థులు జీఆర్‌ఈ, టోఫెల్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా అంతర్జాతీయ విద్యాసంస్థల్లో అడ్మిషన్ లభిస్తుంది.

ఉద్యోగావకాశాలు..

ఈసీఈ అభ్యర్థులు.. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థల్లో, మొబైల్ కమ్యూనికేషన్, టెలి కమ్యూనికేషన్ అండ్ ఐటీ, ఇంటర్నెట్ టెక్నాలజీ, మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీ, ఏరోనాటికల్, మిలటరీ తదితరరంగాల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. అంతేకాకుండా ఇంటెల్, మోటరోలా, ఇస్రో, బీహెచ్ ఈఎల్, క్యాప్ జెమిని, ఫిలిప్స్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీల్లో కూడా అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.

ఇంకా చదవండి:part 5: బీటెక్ సివిల్ ఇంజనీరింగ్.. కొలువుల పరంగా ఎప్పటికీ వన్నెతగ్గని బ్రాంచ్
Published date : 22 Oct 2020 06:26PM

Photo Stories