BTech (Agricultural Engineering): కోర్సులకు స్పాట్ కౌన్సెలింగ్.. దరఖాస్తు తేది ఇదే..
Sakshi Education
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో మిగిలిన బీటెక్ (వ్యవసాయ ఇంజనీరింగ్) కోర్సుల ప్రవేశాల కోసం స్పాట్ కౌన్సెలింగ్ 22వ తేదీన నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టి.గిరిధరకృష్ణ జనవరి 17న ఓ పకటనలో తెలిపారు.
2021–22 విద్యా సంవత్సరానికి భర్తీ కాని సీట్ల ప్రవేశాలకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి ఏపీ ఎంసెట్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. స్పాట్ కౌన్సెలింగ్ నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరుగుతుందన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులు 22న ఉదయం 9 గంటల నుంచి హాజరవ్వాలన్నారు. ప్రవేశం పొందిన అభ్యర్థులు దరఖాస్తుతో పాటు వెంటనే రూ.36,695 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ www. angrau.ac.inను చూడాలన్నారు.
చదవండి:
Good News: ఆంధ్రప్రదేశ్ బాటలో తెలంగాణ
Schools Reopen: ‘ఉత్సాహంగా పాఠశాలలకు’
Department of Rural Development: ఎంపీడీవోలకు నెరవేరుతున్న పాతికేళ్ల కల
Published date : 18 Jan 2022 02:46PM