Skip to main content

Inter Admissions: ఇంటర్‌లో ప్రవేశానికి స్పాట్‌ కౌన్సెలింగ్‌

ఉట్నూర్‌ రూరల్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ని గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్‌ ప్రథ మ సంవత్సరంలో స్పాట్‌ అడ్మిషన్ల కోసం మే 23, 25 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా మే 19న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Spot counseling for admission in Inter

ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఒకేషనల్‌ కోర్సులకు 23న బాలికలకు ఉట్నూర్‌ కేబీ ప్రాంగణంలోని గిరిజ న గురుకుల (బాలికల) కళాశాలలో, 25న గిరిజన గురుకుల (బాలుర) కళాశాల లాల్‌టెక్డీలో కౌన్సిలింగ్‌ ఉంటుందన్నారు.

చదవండి: Telangana is now TG not TS: ఇక నుంచి టీఎస్‌ కాదు టీజీ.. ఇకపై అన్ని ఇలా..

2023–24 వి ద్యాసంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన ఎస్టీ, ఇతర విద్యార్థులు కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. ఆసక్తి కలవారు ధ్రువీ కరణ పత్రాలు రెండు జతల జిరాక్స్‌, 4 పాస్‌ పోర్ట్‌ సైజ్‌ఫొటోలతో ఉదయం 10 గంటల నుంచి కౌన్సిలింగ్‌కు హాజరు కావాలన్నారు.

Published date : 21 May 2024 11:21AM

Photo Stories