Skip to main content

Spot Counseling: మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించండి..

తెలంగాణ యూనివర్సిటీలోని పీజీ కోర్సులు, ఎల్‌ఎల్‌బీ, బీఈడీ కోర్సులలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.
Spot Counseling for PG, LLB, BED Courses

తెయూ రిజిస్ట్రార్‌ యాదగిరికి ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ వినతిపత్రం అందజేశారు. ప్రతి ఏడాది పలు పీజీ కోర్సుల్లో సీట్లు మిగిలిపోతున్నాయన్నారు. వాటిని భర్తీ చేయకుండా వదిలేయడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు నష్టపోతున్నారని, మిగిలిన సీట్లను స్పాట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తర్ల లక్ష్మణ్‌ రాంజీ, చార్వక కార్తిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Gurukul Pratibha College: రేపు గురుకుల ప్రతిభా కళాశాల ప్రవేశ పరీక్ష

Published date : 03 Feb 2024 02:46PM

Photo Stories