Skip to main content

Gurukul Pratibha College: రేపు గురుకుల ప్రతిభా కళాశాల ప్రవేశ పరీక్ష

తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల ప్రతిభా కళాశాలలో 2024–25లో ఇంటర్‌ ప్రథమ ఏడాది ప్రవేశానికి ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రిన్సిపాల్‌ డి.బాలస్వామి తెలిపారు.
Gurukul Pratibha college entrance exam

ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో పరీక్ష నిర్వహణకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 
లింగాల మండల కేంద్రంలోని గురుకులంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న 456 మంది విద్యార్థులు జిల్లా నలుమూలల నుంచి పరీక్షలు రాసేందుకు వస్తున్నారని చెప్పారు.

రేపు ప్రవేశ పరీక్ష..
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశానికి సంబంధించి ప్రవేశ పరీక్ష (సీఈఓ సెట్‌–2024)ను నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా కోఆర్డినేటర్‌ సంగీత, సుద్దపల్లి కళాశాల ప్రిన్సిపాల్‌ గోదావరి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌/జేసీ, ధర్మారం(బి), కంజర, ఆర్మూర్‌(బి), సుద్దపల్లి, పోచంపాడ్‌, నవీపేట్‌, కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, భిక్కనూర్‌, దోమకొండ, తాడ్వాయి, తాడ్కోల్‌, కొయ్యగుట్ట, తక్కడపల్లి, పెద్దకొడప్‌గల్‌, కామారెడ్డి డిగ్రీ కళాశాల పెద్ద ఎక్లార, బాన్సువాడ/బోర్లాం, నిర్మల్‌ జిల్లాలోని ముథోల్‌, లెప్ట్‌ పోచంపాడ్‌, జామ్‌, కడెం, భైసాలోని పరీక్షా కేంద్రాలలో ఈ ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. 

టీఎస్‌డబ్ల్యూఆర్‌ సీవోఈ ప్రవేశ పరీక్ష 
భైంసాటౌన్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ సీవోఈ కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నట్లు భైంసా సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రి న్సిపాల్‌ సుమలత తెలిపారు. పట్టణంలోని నిర్మల్‌రోడ్డులో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. హాల్‌టికెట్‌లో ‘సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, భైంసా ఎట్‌ బాసర్‌’ అని ఉన్నవారు భైంసాలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల (ఓల్డ్‌ సరస్వతి కాలే జ్‌) దగ్గరికి రావాలని తెలిపారు. హాల్‌టికెట్‌లో వివరాలు తప్పుగా ఉంటే సంబంధిత ఆధారాలతో హాజరు కావాలని, వివరాలకు 79950 10575, 96422 00405 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

పరీక్షకు వచ్చే విద్యార్థులు ఉదయం 9 గంటల లోపు కేంద్రానికి చేరుకోవాలని 10 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష సమయం ఉంటుందన్నారు. తమ వెంట ఆన్‌లైన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌, ఆధార్ కార్డు, ప్యాడ్‌, బ్లూ లేదా బ్లాక్‌ పెన్ను, వాటర్‌ బాటిల్‌ వెంట తెచ్చుకోవాలని సూచించారు.

Gurukula School Admissions: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Published date : 03 Feb 2024 01:39PM

Photo Stories