TSPSC Group 1 and DSC Notification Problems 2024 Update : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1, డీఎస్సీ నోటిఫికేషన్ ఇంకెప్పుడు..? ఆందోళనలో అభ్యర్థులు..?
ఇప్పటికే గత ప్రభుత్వంలో మోసపోయిన గ్రూప్-1 అభ్యర్థులు.. ఈ ప్రభుత్వంలో కూడా.. ఇబ్బంది పడతాము ఏమో అని అనుకుంటున్నారు. అయితే టీఎస్‌పీఎస్సీ మాత్రం గ్రూప్-1 లో మరిన్ని పోస్టులు కలిపి మొత్తం 663 పోస్టులకు వరకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు ఉంది. అలాగే గ్రూప్-1 నోటిఫికేషన్ తర్వాతే.. గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసే ఆలోచనలో టీఎస్సీపీఎస్సీ ఉంది.
గ్రూప్-1 ఉద్యోగ పోస్టులకు మరో 160 అదనపు పోస్టులు కలిపి రీ-నోటిఫికేషన్ వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాత నోటిఫికేషన్‌లోని 503 పోస్టులు, మరో 160 అదనపు పోస్టులు కలిపి 663 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1,2,3&4 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ఇంకెప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్..?
ఇదే విధంగా తెలంగాణలో కూడా డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేస్తామన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా.. మరో 4,800 టీచర్ పోస్టులు, 2 వేల స్పెషల్ టీచర్ పోస్టులు, 1000 మోడల్ స్కూల్ టిచర్ పోస్టులు జత చేసి ప్రకటన ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు తుది కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో 5089 పోస్టులకు తోడుగా 7800 నూతనంగా భర్తీ చేయడానికి చర్యలు చేపట్టారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య దాదాపుగా 13 వేలకు చేరుకోవచ్చు అని విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారో.. ఇంకా ఆలస్యం అవుతుందో.. అనే ఆలోచనలో అభ్యర్థులు ఆందోళన చేందుతున్నారు. అలాగే ఉపాధ్యాయులు బదిలీలు, ఖాళీల వివరాలు తెలిసే వరకు ఈ నోటిఫికేషన్ వచ్చే సూచనలు కనిపించడం లేదు.
ఇలా నోటిఫికేషన్ జారీ చేయడమే మంచిది..?
సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండడం, అటు టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ఇప్పట్లో సాధ్యం అయ్యే పరిస్థితి లేనందున వచ్చే నెలలో లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో ఆ లోపే గత ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీకి మరిన్ని పోస్టులు కలిపి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడమే మంచిదని అధికారులు భావిస్తున్నారు.
Tags
- tspsc group 1 and dsc notification 2024
- tspsc group 1 notification 2024 problems
- tspsc group 1 notification 2024 postponed
- tspsc group 1 notification 2024 expected date
- tspsc group 1 notification 2024 expected date news telugu
- dsc notification 2024 expected date
- dsc notification 2024 expected date telangana
- TS DSC 2024 Updates
- ts dsc 2024 update news telugu
- ts group 1 update 2024 news
- ts group 1 notification update 2024
- ts dsc notification update 2024 news telugu
- ts group 1 notification update news 2024 telugu
- Group-1 notification update
- February 1 declaration
- TSPSC Announcement
- Sakshi Education Updates