Skip to main content

Good News for DSC Candidates 2008 : డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌.. వీళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఉద్యోగాలు.. ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన‌ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
telangana cabinet meeting    Telangana Cabinet Decision Announcement   Cabinet decision favors 2008 DSC candidates in Telangana   2008 DSC candidates receiving job opportunities in Telangana

కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయవిచారణకు కేబినేట్ నిర్ణయం తీసుకుంది. దీని విచారణ కమిటీ చైర్మన్‌గా జస్టిస్‌ పీసీ చంద్రఘోష్‌ ఎంపిక చేశారు. 

అర్హులైన పేదలకు..
అలాగే అత్యంత ముఖ్య‌మైన నూతన రేషన్ కార్డుల జారీకి కేబినేట్ అమోదం  తెలిపింది. అర్హులైన పేదలకు తెల్ల రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 22,500 కోట్లు కేటాయింపుకు కేబినెట్ సమావేశంలో అమోదం తెలిపింది. 14 బీసీ కార్ఫోరేషషన్‌ల‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ లకు నూతన ప్రత్యేక కార్పోరేషన్ ల ఏర్పాటు చేయ‌నున్నారు.

చదవండి: TS DSC and TET Candidates Demands : తెలంగాణ డీఎస్సీ, టెట్ అభ్య‌ర్థుల డిమాండ్లు ఇవే.. ఈ నిబంధనలు తొల‌గించాల్సిందే..!

డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌..
అలాగే 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేబినేట్ మ‌రో కీల‌న నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినట్లు ఇవ్వాలని నిర్ణయించారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ ప్రాజెక్టులు, విద్యుత్‌ కొనుగోళ్ల అంశంపై విశ్రాంత జడ్జి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణకు కేబినెట్‌ నిర్ణయం. రెండు రోజుల్లో 93శాతం రైతు బంధు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

Published date : 13 Mar 2024 10:34AM

Photo Stories