High Court: ఉపాధ్యాయులకు ఊరట
దీంతో ఈ ప్రక్రియకు మోక్షం లభించింది. ఈ ఏడాది జనవరిలో బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా జనవరి 29 నుంచి ఫిబ్రవరి 25 వరకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించి వముగించాలని పాఠశాల విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేసింది. దీని ప్రకారం జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించింది.
చదవండి: TS DSC Notification 2023: జిల్లాల వారీగా టీచర్ పోస్టులు ఇవీ.. అత్యధిక ఖాళీలు ఈ జిల్లాలోనే
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 1,191 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 4,752 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరికి చివరిసారిగా 2018లో బదిలీలు చేపట్టారు. సాధారణంగా రెండేళ్లు పూర్తయితే బదిలీలకు అర్హులు, అంతేకాకుండా 8 ఏళ్లు ఒకే చోట పనిచేస్తే బదిలీ తప్పనిసరి. ఎనిమిదేళ్లు ర్వీస్ పూర్తి చేసుకున్నవారు 1,248 మంది టీచర్లు ఉన్నారు.
వీరు కొన్ని నెలలుగా బదిలీలు చేపట్టాలని డి మాండ్ చేస్తున్నారు.
ఉపాధ్యాయ బదిలీలు 2015 లో జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు పదో న్నతులు లేవు. జిల్లాలో 978 మంది ఉపాధ్యా యులు పదోన్నతులకు అర్హుత కలిగి ఉన్నారు. ప్ర స్తుతం బదిలీలకు లైన్‌క్లియర్ కావడంతో ఎట్టకేలకు బదిలీలు, పదోన్నతులు జరుగనున్నాయి.
చదవండి: Teacher Posts 2023: 744 పోస్టులు ఖాళీలు.. త్వరలో విడుదల కానున్న డీఎస్సీ నోటిఫికేషన్
ఉపాధ్యాయుల వివరాలు
స్కూల్ అసిస్టెంట్లు |
2,015 |
భాషా పండితులు |
489 |
ఎస్జీటీలు |
2,144 |
పీఈటీలు |
104 |
మొత్తం |
4,752 |