Skip to main content

Teacher Posts 2023: 744 పోస్టులు ఖాళీలు.. త్వరలో విడుదల కానున్న డీఎస్సీ నోటిఫికేషన్‌

సూర్యాపేట టౌన్‌: ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ (డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ) ద్వారా భర్తీ చేస్తామని తాజాగా విద్యాశాఖ మంత్రి ప్రకటించింది.
teacher
teacher

డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థుల్లో ఉపాధ్యాయ నియామకాలపై ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 744 పోస్టులు ఖాళీలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే ఇందులో 185 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపారు. కానీ ఎన్ని పోస్టులకు ఉద్యోగ ప్రకటన వెలువరిస్తారోనన్న పూర్తిస్థాయి వివరాలు మరో రెండు రోజుల్లో స్పష్టం కానుండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. గతేడాది బదిలీల ప్రక్రియను ప్రారంభించినప్పటికీ, కోర్టు జోక్యంతో మధ్యలోనే ఆగిపోయింది. దీనికి తోడు కొన్నేళ్లుగా విద్యావలంటీర్ల నియమకాన్ని చేపట్టడం లేదు. ఫలితంగా జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు తదితర కారణాలు విద్యా ప్రమాణాల పెంపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

Also read: Gurukula Posts: గెస్ట్‌ ఫ్యాకల్టీలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లావ్యాప్తంగా

3,224 మందే టీచర్లు

జిల్లాలో 950 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 67వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 3,968 మంది ఉపాధ్యాయులు అవసరముండగా ప్రస్తుతం 3,224 మందే ఉన్నారు. ఇంకా 744 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది.

Also read: NMMS scholarship 2023: నేషనల్‌ మీన్‌న్స్‌కం మెరిట్‌ స్కాలర్‌ షిప్‌ పరీక్షకు ఉచిత స్టడీ మెటీరియల్‌..

ఆరేళ్లుగా నిరీక్షణ..

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన 2017లో టీఆర్‌టీని నిర్వహించారు. ఆ తర్వాత నుంచి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడంతో అభ్యర్థులు అప్పటి నుంచి నిరీక్షిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎలాగైనా టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తుందనే నమ్మకంతో ఏటా బీఈడీ, డీఈడీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు నోటిఫికేషన్‌ను సైతం జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెల 15న పరీక్ష నిర్వహించనున్నారు.

Also read: APPSC Group-1 స్టేట్ 1st ర్యాంక‌ర్ Bhanusri Interview| నేను చదివిన పుస్తకాలు ఇవే..|#sakshieducation

ఫలితాలు అదేనెల 27న ప్రకటించనుండడంతో తాజాగా విడుదలయ్యే నోటిఫికేషన్‌కు మరింత మంది నిరుద్యోలు అర్హత సాధించే అవకాశం ఉంది. గత ఏడాది టెట్‌ రాసి క్వాలిఫై అయిన వారు పేపర్‌–1లో 3,694 మంది అభ్యర్థులు కాగా ప్రస్తుతం టెట్‌ రాసేందుకు 10,026 మంది అభ్యర్థులు ఉన్నారు. పేపర్‌–2లో గత ఏడాది 5,491 మంది అర్హత సాధించగా ప్రస్తుతం 6,513 మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.

Also read: APPSC Group-1.. తొలి ప్రయత్నంలోనే కొట్టానిలా..| APPSC Group 1 Ranker Pavani Success Story | DSP Job

సర్దుబాటుతో వెళ్లదీస్తూ..

గతంలో పాఠశాలల్లో ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యావలంటీర్ల నియామకం వల్ల సమస్యకు కాస్త అధిగమించారు. కానీ, కరోనా నుంచి విద్యావలంటీర్లను మరలా నియమించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధించే వారు లేక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. దీనిని గుర్తించిన విద్యాశాఖ గతేడాది జూలైలో కొందరు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసింది. వీరంతా విద్యా సంవత్సరం చివరి రోజున నిర్దేశిత పాఠశాలలో మళ్లీ రిపోర్టు చేశారు. మళ్లీ జిల్లాలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి టీచర్లు లేని పాఠశాలలకు పక్కన ఉన్న టీచర్లను సర్దుబాటు చేశారు. ఈ విద్యాసంవత్సరం కూడా సర్దుబాటుతోనే వెళ్లదీస్తున్నారు.

Also read: AP Deputy EO: Syllabus & ఎన్ని Papers.. ఎన్ని మార్కులు ఉంటాయి అంటే! #sakshieducation

ఖాళీ పోస్టులు

 • జీహెచ్‌ఎం 106
 • స్కూల్‌ అసిస్టెంట్లు 286
 • ఎస్‌జీటీలు 222
 • పీఈటీలు 03
 • ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు 104
 • ఎల్‌పీటీలు 11
 • ఎల్‌పీహెచ్‌లు 12
 • మొత్తం 744
 • భర్తీ చేసే పోస్టులు
 • ఎస్‌ఏలు 80
 • ఎస్‌జీటీలు 78
 • ఎల్‌పీలు 23
 • పీఈటీలు 04
 • మొత్తం 185

Also read: TS TET - AP Deputy EO: ఈ Video follow అయితే 10 బిట్స్ పక్కా.. #sakshieducation

Published date : 26 Aug 2023 02:30PM

Photo Stories