Indian Coast Guard Notification 2024: ఇంటర్ విద్యార్హతతో 260 నావిక్ ఉద్యోగాలు.. ఎంపిక ఇలా
మొత్తం పోస్టులు: 260 (ఈస్ట్ జోన్ 33)
అర్హతలు
మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. వయసు:18-22ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ,ఎస్టీలకు ఐదేళ్లు;ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది.ఈ పోస్టులకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
వేతనాలు
ఈ ఉద్యోగంలో చేరిన వారికి లెవల్-3 ప్రకారం- రూ.21,700 మూలవేతనంగా లభిస్తుంది. దీంతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ప్రోత్సహాకాలు అదనం. అన్నీ కలిపి ఈపోస్టుల్లో చేరిన వారికి నెలకు రూ.40వేల వరకు వేతనంగా పొందే అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు నావిక్ నుంచి ప్రధాన నావిక్, అధికారి, ఉత్తమ అధికారి, ప్రధాన అధికారి (లెవల్-8) హోదా వరకు చేరుకోవచ్చు.
ఎంపిక ఇలా
స్టేజ్1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా ఎంపిక చేపడతారు. ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చి.. అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు.
స్టేజ్ 1 రాత పరీక్ష
- స్టేజ్ 1న పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. రెండు సెక్షన్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. నెగిటివ్ మార్కులు లేవు.
- సెక్షన్-1: ఈ విభాగంలో ప్రశ్నలు పదోతరగతి స్థాయిలోనే అడుగుతారు. మొత్తం 60 మార్కులకు-60 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో మ్యాథ్స్-20, సైన్స్-10, ఇంగ్లిష్-15, రీజనింగ్-10, జీకేల నుంచి 5 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు ఉంటుంది.
- సెక్షన్-2: ఈ విభాగంలో 50 మార్కులుంటాయి. 50 ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 30 నిమిషాలు. ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి మ్యాథ్స్,ఫిజిక్స్ ఒక్కో సబ్జెక్టులో 25చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి సెక్షన్‌లోనూ కనీస మార్కులు సాధించడం తప్పనిసరి. జనరల్ అభ్యర్థులు సెక్షన్-1లో 30, సెక్షన్-2లో 20 చొప్పున మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీలకు..సెక్షన్-1లో 27, సెక్షన్-2లో 17 చొప్పున మార్కులు వస్తే అర్హులుగా పరిగణిస్తారు. ఇలా అర్హత సాధించిన వారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల్ ప్రకారం ఖాళీలకు అనుగుణంగా స్టేజ్-2కు ఎంపిక చేస్తారు.
చదవండి: Indian Army Recruitment 2024: జెడ్‌ఆర్‌వో చెన్నైలో సిపాయి ఫార్మా పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
స్టేజ్-2 అర్హత పరీక్ష మాత్రమే
ఈ పరీక్షలను ఒకటి లేదా రెండు రోజుల వ్యవధితో నిర్వహిస్తారు. ఇందులో అసెస్‌మెంట్/అడాప్టబిలిటీ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. వీటిల్లో అర్హత సాధిస్తే సరిపోతుంది. మార్కులు ఉండవు. ఇందులో భాగంగా నిర్వహించే పరీక్షలో సమాధానాలు ఓఎంఆర్‌షిట్‌పై గుర్తించాలి. పరీక్ష జరిగిన గంట తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. ఇందులో అర్హత
సాధించినవారికే తర్వాతి దశకు పంపిస్తారు.
- స్టేజ్-3: మొదటి రెండు దశల్లో (స్టేజ్-1,2)ప్రతిభను పరిగణలోకి తీసుకొని స్టేజ్-3కి ఎంపిక చేస్తారు. అంటే స్టేజ్-2లో అర్హత సాధించిన వారిని స్టేజ్-1 మెరిట్‌తో స్టేజ్-3కి ఎంపిక చేస్తారు. వీరికి ఐఎన్‌ఎస్ చిల్కలో మెడికల్ పరీక్షలను నిర్వహించి అర్హులైన వారిని స్టేజ్-4 ఎంపిక చేస్తారు.
- స్టేజ్-4: ఈ దశలో భాగంగా అభ్యర్థుల ఒరిజనల్ సర్టిఫికేట్స్ మరోమారు పరిశీలించి అన్ని సరిగా ఉంటే ట్రైనింగ్‌లోకి తీసుకుంటారు.
స్టేజ్-1 పరీక్షలను ఏప్రిల్, స్టేజ్-2 పరీక్షలను మేలో,స్టేజ్-3 పరీక్షలను అక్టోబర్‌లో నిర్వహిస్తారు.
శిక్షణ ఇలా
ఈ పోస్టులకు ఎంపికైన వారికి సెప్టెంబర్‌లో బేసిక్ ట్రైనింగ్ ఐఎన్‌ఎస్ చిల్కలో ప్రారంభమవుతుంది. ఈ ట్రైనింగ్ వ్యవధి 16 వారాలు ఉంటుంది. ఆ తర్వాత వీరికి సముద్రంలో 6నెలల నుంచి రెండున్నర ఏళ్ల వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 27, 2023
- వెబ్‌సైట్: https://joinindiancoastguard.cdac.in/
Tags
- Indian Coast Guard Notification 2024
- Defence Jobs
- Union Ministry of Defence
- Navik General Duty Jobs
- latest notifications
- latest job notifications 2024
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- RecruitmentAdvertisement
- NavikRecruitment
- GeneralDutyJobs
- JobOpportunity
- ApplyNow