Skip to main content

Wrestling World Championships: ప్రపంచ అండర్‌–20 చాంపియన్‌షిప్‌లో విశ్వవిజేతగా పంఘాల్‌

భారత యువ మహిళా రెజ్లర్లు శుక్రవారం కొత్త చరిత్రను లిఖించారు.
Wrestling-World-Championships-2023
Wrestling World Championships-2023

తొలిసారి ప్రపంచ అండర్‌–20 చాంపియన్‌షిప్‌లో టీమ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. హరియాణా అమ్మాయి అంతిమ్‌ పంఘాల్‌ వరుసగా రెండో ఏడాది 53 కేజీల విభాగంలో విశ్వవిజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా గుర్తింపు పొందింది. ఫైనల్లో అంతిమ్‌ 4–0తో మరియా యెఫ్రెమోవా (ఉక్రెయిన్‌)పై గెలిచింది. 

World Under-20 Wrestling Championship 2023: ప్రపంచ అండర్‌–20 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ప్రియా మలిక్‌కు స్వర్ణం

సవితా దలాల్‌ (62 కేజీలు) కూడా ప్రపంచ చాంపియన్‌ అయ్యింది. ఫైనల్లో సవిత 10–0తో చిరినోస్‌ (వెనిజులా)పై గెలిచింది. అంతిమ్‌ కుందు (65 కేజీలు) రజతం నెగ్గగా... రీనా (57 కేజీలు), ఆర్జూ (68 కేజీలు), హర్షిత (72 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. ఓవరాల్‌గా భారత్‌ ఏడు పతకాలు నెగ్గి 140 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

World senior Shooting Championship: ప్రపంచ సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం

Published date : 19 Aug 2023 03:17PM

Photo Stories