Wrestling Competitions: జిల్లా స్థాయిలో గెలిచి రాష్ట్ర స్థాయి పోటీలో ఎంపిక
సాక్షి ఎడ్యుకేషన్: ఏపీ స్టేట్ స్కూల్ ఫెడరేషన్ అంతర్ జిల్లాల రెజ్లింగ్ చాంపియన్‌షిప్ అండర్–14 విభాగంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఇద్దరు గిరిజన విద్యార్ధులు జాతీయ స్ధాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 21 నుంచి 23 వరకూ విజయవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ పోటీలు జరిగాయి. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన కుంజం వెంకన్నదొర 48 కిలోలు, పిట్టా నిఖిల్‌రెడ్డి 55 కిలోల విభాగంలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం వరప్రసాద్ తెలిపారు.
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టుకు స్వర్ణ పతకం
వచ్చేనెల ఒకటో తేదీన మధ్యప్రదేశ్ బోపాల్‌లో జరగనున్న జాతీయ స్ధాయి పోటీల్లో వీరు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఎంపికకైన విద్యార్థులను పీఈటీ బండారు మల్లేశ్వరరావును ఆయనతోపాటు ఉపాధ్యాయులు అభినందించారు.