World Championships: రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయురాలు?
ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్–2021లో భారత యువ రెజ్లర్, హరియాణకి చెందిన అన్షు మలిక్ అద్భుత ప్రదర్శన చేసింది. నార్వే రాజధాని నగరం ఓస్లోలో అక్టోబర్ 6న జరిగిన 57 కేజీల విభాగం సెమీఫైనల్లో అన్షు 11–0 పాయింట్లతో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో సొలోమియా వినిక్ (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. ఫలితంగా అన్షు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. దీంతో ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా 20 ఏళ్ల అన్షు రికార్డు నెలకొల్పింది. ఫైనల్లో 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్, 2020 టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత హెలెన్ లూయిస్ మరూలిస్ (అమెరికా)తో అన్షు తలపడుతుంది.
ఆరో మహిళా రెజ్లర్: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం ఖాయం చేసుకున్న ఆరో భారతీయ మహిళా రెజ్లర్ అన్షు మలిక్. గతంలో అల్కా తోమర్ (2006లో; 59 కేజీలు), బబితా ఫొగాట్ (2012లో; 51 కేజీలు), గీతా ఫొగాట్ (2012లో; 55 కేజీలు), పూజా ధాండా (2018లో; 57 కేజీలు), వినేశ్ ఫొగాట్ (2019లో; 53 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.
చదవండి: ప్రొ కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్?
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : అన్షు మలిక్
ఎక్కడ : ఓస్లో, నార్వే
ఎందుకు : 57 కేజీల విభాగం సెమీఫైనల్లో అన్షు 11–0 పాయింట్లతో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో సొలోమియా వినిక్ (ఉక్రెయిన్)పై విజయం సాధించడంతో...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్