PKL 2021: ప్రొ కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్ 2021, డిసెంబర్ 22 నుంచి మొదలుకానుంది. అయితే మ్యాచ్‌లను తిలకించేందుకు ప్రేక్షకుల్ని అనుమతించడం లేదు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆటగాళ్లు, ఇతర సిబ్బంది ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎనిమిదో సీజన్ ఒకే ఒక వేదికలో నిర్వహిస్తున్నారు. మ్యాచ్‌లన్నీ కర్ణాటక రాజ«ధాని బెంగళూరులోనే నిర్వహిస్తామని లీగ్ కమిషనర్, మశాల్ స్పోర్ట్స్ సీఈఓ అనుపమ్ గోస్వామి అక్టోబర్ 5న తెలిపారు. 2020 ఏడాది కరోనా భయాందోళనల నేపథ్యంలో ఈవెంట్‌ను రద్దు చేశారు. పీకేఎల్–7 చివరిసారిగా 2019లో జరగ్గా బెంగాల్ వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది.
లవ్లీనా బొర్గోహైన్ ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?
2021, డిసెంబర్‌లో ఇస్తాంబుల్‌లో జరిగే మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత బాక్సింగ్ జట్టులో లవ్లీనా బొర్గోహైన్‌కు చోటు కల్పిస్తున్నట్లు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) తెలిపింది. అక్టోబర్ 21 నుంచి హరియాణాలోని హిసార్ వేదికగా జరిగే జాతీయ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలు నెగ్గే బాక్సర్లను మాత్రమే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపిక చేస్తారు. అయితే టోక్యో ఒలింపిక్స్–2020లో లవ్లీనా (69 కేజీలు) కాంస్య పతకంతో మెరవడంతో ఆమెకు భారత జట్టులో నేరుగా ప్రవేశం కల్పించారు.
చదవండి: షూటింగ్‌లో కొత్త రికార్డును నెలకొల్పిన భారతీయుడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, డిసెంబర్ 22 నుంచి ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : లీగ్ కమిషనర్, మశాల్ స్పోర్ట్స్ సీఈఓ అనుపమ్ గోస్వామి
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
డౌన్‌లోడ్ వయా ఆపిల్ ఐ స్టోర్