Skip to main content

World Championship: షూటింగ్‌లో కొత్త రికార్డును నెలకొల్పిన భారతీయుడు?

Aishwary Pratap Singh Tomar

పెరూ రాజధాని నగరం లిమాలో జరుగుతున్న ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ షూటర్‌ ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ స్వర్ణ పతకం సాధించాడు. అక్టోబర్‌ 5న జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ విభాగం ఫైనల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన తోమర్‌ 463.4 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అతడు 462.9 పాయింట్లతో ఫిలిప్‌ నెపిచాల్‌ (చెక్‌ రిపబ్లిక్‌) పేరిట ఉన్న జూనియర్‌ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఫ్రాన్స్‌ షూటర్‌ లుకాస్‌ క్రిజ్స్‌ (456.5 పాయింట్లు) రజతాన్ని... అమెరికాకు చెందిన గావిన్‌ బార్నిక్‌ (446.5 పాయింట్లు) కాంస్యాన్ని దక్కించుకున్నారు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ 8 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలతో అగ్రస్థానంలో ఉంది.

చ‌ద‌వండి: కామన్వెల్త్‌ గేమ్స్‌–2022ను ఎక్కడ నిర్వహించనున్నారు?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు పసిడి పతకం గెలుచుకున్న భారతీయుడు?
ఎప్పుడు : అక్టోబర్‌ 5
ఎవరు    : ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌
ఎక్కడ    : లిమా, పెరూ
ఎందుకు : పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ విభాగం ఫైనల్లో తోమర్‌ 463.4 పాయింట్లతో విజేతగా నిలిచినందున...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌


డౌన్‌లోడ్‌ వయా ఆపిల్‌ ఐ స్టోర్‌

Published date : 06 Oct 2021 06:07PM

Photo Stories