Hockey India: కామన్వెల్త్ గేమ్స్–2022ను ఎక్కడ నిర్వహించనున్నారు?
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగే ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్–2022 నుంచి భారత హాకీ జట్టు వైదొలిగింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బత్రాకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు జ్ఞానేంద్రో నింగోమ్‌బామ్ అక్టోబర్ 5న సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ తీవ్రత కొనసాగుతోంది. అంతేకాకుండా భారత్ నుంచి వచ్చే పర్యాటకులపై అక్కడి ప్రభుత్వం వివక్షపూరిత ఆంక్షలు అమలు చేస్తోంది. దీంతో ఏషియాడ్∙(ఆసియా క్రీడలు)పై దృష్టి పెట్టి కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలగాలని హాకీ ఇండియా నిర్ణయం తీసుకుంది. మరోవైపు భువనేశ్వర్‌లో జరిగే జూనియర్ ప్రపంచకప్ హాకీ–2021 నుంచి ఇంగ్లండ్ వైదొలిగిన విషయం విదితమే.
ముఖ్యాంశాలు...
- కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు 2022 ఏడాదే జరుగనున్నాయి. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ గేమ్స్... సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు హాంగ్జౌ (చైనా)లో ఆసియా క్రీడలు జరుగుతాయి.
- ఈ మెగా ఈవెంట్ల మధ్య కేవలం 32 రోజుల విరామమే ఉంది. దీంతో కామన్వెల్త్‌ను పక్కన పెట్టి.. ఏషియాడ్ విజేతగా నిలిచి 2024 పారిస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాలని హాకీ ఇండియా భావించింది.
- కామన్వెల్త్ గేమ్స్‌లో 1998లో హాకీని మెడల్ ఈవెంట్‌గా ప్రవేశపెట్టారు.
- భారత పురుషుల హాకీ జట్టు రెండు సార్లు (2010, 2014) రజతం...మహిళల జట్టు స్వర్ణం (2002), రజతం (2006) సొంతం చేసుకున్నాయి.
చదవండి: భారత్‌కు స్వర్ణం అందించిన నామ్యా ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్–2022 నుంచి వైదొలగాలని నిర్ణయం
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : హాకీ ఇండియా (హెచ్‌ఐ)
ఎక్కడ : బర్మింగ్‌హామ్, ఇంగ్లండ్
ఎందుకు : భారత్ నుంచి వచ్చే పర్యాటకులపై ఇంగ్లండ్ ప్రభుత్వం వివక్షపూరిత ఆంక్షలు అమలు చేస్తుండటంతో...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్