Skip to main content

Surya Kumar hits 100 sixes: సిక్సర్ల‌ సూర్య‌

గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో  సూర్యకుమార్‌ యాదవ్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
Surya-Kumar-hits-100-sixes
Surya Kumar hits 100 sixes

 అంతర్జాతీయ టీ20ల్లో సూర్య 100 సిక్స్‌ల మైలు రాయిని అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ 10 ఓ‍వర్‌ వేసిన షెఫెర్డ్‌ బౌలింగ్‌లో తన వందో సిక్స్‌ను సూర్య బాదాడు. ఈ క్రమంలో టీ20ల్లో అత్యంత వేగంగా 100 సిక్స్‌లు కొట్టిన రెండో ఆటగాడిగా సూర్య రికార్డులకెక్కాడు. స్కై తన 49వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత అందుకున్నాడు. ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో విండీస్‌ ఆటగాడు ఎవిన్‌ లూయిస్‌ తొలి స్ధానంలో ఉన్నాడు.

☛☛ Ravindra Jadeja breaks Kapil Dev Record: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు

లూయిస్‌ 42 ఇన్నింగ్స్‌లలోనే తన 100 సిక్స్‌లను పూర్తి చేశాడు. అదే విధంగా టీ20ల్లో 100 సిక్స్‌ల మైలు రాయిని అందుకున్న మూడో భారత బ్యాటర్‌గా సూర్యకుమార్‌ నిలిచాడు. ఈ జాబితాలో సూర్యకంటే ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఉన్నారు.

☛☛ Ashwin breaks Kumble's Record: విండీస్ గ‌డ్డ‌పై అశ్విన్‌ అరుదైన రికార్డు..

Published date : 09 Aug 2023 12:08PM

Photo Stories