Ravindra Jadeja breaks Kapil Dev Record: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు
Sakshi Education
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు.
వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. తొలి వన్డేలో మూడు వికెట్లతో చెలరేగిన జడ్డూ.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.ఇప్పటివరకు విండీస్‌పై వన్డేల్లో 44 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భారత దిగ్గజం కపిల్‌దేవ్(43 వికెట్లు) రికార్డును జడ్డూ బ్రేక్ చేశాడు. అదే విధంగా భారత్-వెస్టిండీస్ మధ్య వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా, దిగ్గజ విండీస్ పేస్ బౌలర్ కోర్ట్నీ వాల్ష్ రికార్డును సమం చేశాడు.
☛☛ Ashwin breaks Kumble's Record: విండీస్ గడ్డపై అశ్విన్ అరుదైన రికార్డు..
Published date : 29 Jul 2023 05:26PM