World Taekwondo: వరల్డ్ తైక్వాండో కల్చర్ ఎక్స్‌పోలో భారత్‌కు ఏడు పతకాలు

దక్షిణ కొరియాలోని ముజు గున్ – జియోన్‌బక్‌లో జరిగిన ఈ పోటీల్లో 27 దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ పోటీల్లో భారత్‌కు చెందిన తైక్వాండో అథ్లెట్లు ఏడు పతకాలు గెలుచుకున్నారు.
➤ మహిళల అండర్–15 కేటగిరీలో ఇరువజ్జుల వైశాలి ఒక రజతం, ఒక కాంస్యం సాధించింది. క్యోరుగీ, పూమ్‌సే ఈవెంట్‌లలో ఆమె ఈ పతకాలు సాధించింది.
➤ అండర్–15 (పురుషుల) కేటగిరీలో నూతక్కి సౌజిత్ కూడా రజతం (పూమ్‌సే), కాంస్యం (క్యోరుగీ) గెలుచుకున్నాడు.
➤ అండర్–39 మహిళల విభాగంలో డోలి పవిత్ర స్వర్ణం (క్యోరుగి), కాంస్యం (పూమ్‌సే) అందుకోగా.. మహిళల అండర్–50 కేటగిరీలో తిమ్మాయమోద వెంకటకుమారి (పూమ్‌సే అండ్ క్యోరుగి) పసిడి పతకం సాధించింది.
➤ అథ్లెట్లతో పాటు సహాయ సిబ్బంది హోదాలో గ్రాండ్‌మాస్టర్ మర్రిపాటి నాగూర్, శివరామ్ మక్వానా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే ఏపీ క్రీడాకారులు వీరే..