Skip to main content

British Grand Prix: హామిల్టన్‌ రికార్డు.. ఒకే సర్క్యూట్‌పై తొమ్మిదిసార్లు విజేతగా నిలిచిన డ్రైవర్

ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 945 రోజుల తర్వాత ఫార్ములా వన్ (ఎఫ్‌1) రేసులో మళ్లీ విజయం సాధించాడు.
Lewis Hamilton wins British Grand Prix after 945 days F1 victory drought

జూలై 7వ తేదీ జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటిష్ డ్రైవర్ అద్భుతమైన ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. చివరిసారి హామిల్టన్‌ 2021 డిసెంబర్‌ 5న సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో గెలుపొందాడు. 

సిల్వర్‌స్టోన్‌ సర్క్యూట్‌పై జరిగిన 52 ల్యాప్‌ల రేసును హామిల్టన్‌ (మెర్సిడెస్‌) అందరికంటే వేగంగా ఒక గంటా 22 నిమిషాల 27.059 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఫార్ములావన్‌ చరిత్రలో ఒకే సర్క్యూట్‌పై అత్యధికంగా 9 సార్లు విజేతగా నిలిచిన డ్రైవర్‌గా హామిల్టన్‌ రికార్డు నెలకొల్పాడు. 

మైకేల్‌ షుమాకర్‌ (జర్మనీ) ఫ్రాన్స్‌లోని మాగ్నీ కోర్స్‌ సర్క్యూట్‌లో అత్యధికంగా 8 సార్లు గెలిచాడు. తాజా గెలుపుతో షుమాకర్‌ రికార్డును హామిల్టన్‌ సవరించాడు. 24 రేసుల తాజా సీజన్‌లో 12 రేసులు ముగిశాక వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) 255 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి జూలై 21వ తేదీ జరుగుతుంది.

Abhishek Sharma: తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ.. అత్యంత వేగంగా సెంచరీ చేసిన వారు వీరే..

Published date : 09 Jul 2024 02:27PM

Photo Stories