Surya Kumar Yadav : సూర్యకుమార్ యాదవ్.. విధ్వంసకరం.. 45 బంతుల్లో సెంచరీ చేశాడిలా..
బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన సూర్య మరో టీ20 సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. జట్టుకు భారీ స్కోరును అందించాడు. శ్రీలంకతో జరుగుతున్న ఆఖరిదైన మూడో టీ20లో టీమిండియా 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు. సూర్య కుమార్ ( 51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు) శతకం బాదాడు.
బౌలర్ల పాలిట సింహస్వప్నంలా..
గత ఏడాది 2022 బౌలర్ల పాలిట సింహస్వప్నంలా నిలిచిన బ్యాటర్ల జాబితాలో టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ముందువరుసలో ఉన్నాడు. స్కై.. 2022 ఏడాది టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయి ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడి మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ బిరుదుకు న్యాయం చేశాడు. ఈ ఏడాది టీ20ల్లో స్కై ఆడిన కొన్ని షాట్లు చూసి విశ్లేషకులు నివ్వెరపోయారు. స్కై.. తొలి 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌కు ఏమాత్రం తీసిపోడని ప్రశంసలతో ముంచెత్తారు.