IPL Schedule 2023 : ఐపీఎల్ 2023 షెడ్యూల్ ఇదే.. ఏఏ మ్యాచ్ ఎప్పుడంటే..?
గత ఏడాది తరహాలో ఈ ఏడాది కూడా 10 జట్లు పోటీపడబోతున్నాయి. మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఏప్రిల్ 1న రాజస్థాన్ రాయల్స్ Vs సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. మొత్తం 12 వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
Team India Records : ప్రపంచంలోనే తొలి జట్టుగా.. చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఎలా అంటే..?
ఈ లీగ్‌లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు..
ఈ ఏడాది లీగ్ లో 10 జట్లలో ఒక్కొక్కటి 7 మ్యాచ్‌లు విదేశాల్లో.., మిగతావి హోమ్ గ్రౌండ్ లో ఆడనున్నాయి. మే చివర్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీని స్టార్‌స్పోర్ట్స్‌లో చూడొచ్చు. ఈ లీగ్‌లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు ఉండనున్నాయి. ఇందులో 18 డబుల్ హెడర్స్ ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో పాల్గొననున్న జట్లలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. హోంగ్రౌండ్‌లో ఏడు మ్యాచ్‌లు, బయట ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాయి.
ఎంట్రీ ఇచ్చి.. కప్ కొట్టిన తొలి జట్టు ఇదే..
గత ఏడాది భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ టీమ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లోకి గత ఏడాది ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ టీమ్.. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచి అరంగేట్రం సీజన్‌లోనే టైటిల్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది.
IPL 2023 Mini Auction Latest News : ఐపీఎల్ 2023 వేలంలో అత్యధికంగా ధర పలికిన ఆటగాళ్లు వీరే..
ఐపీఎల్ 10 టీంలు ఇవే..
ఐపీఎల్‌లో మొత్తం 10 జట్లు పోటీపడుతున్నాయి. ఇందులో గుజరాత్, లక్నో టీమ్స్ గత ఏడాది టోర్నీలోకి అడుగుపెట్టాయి.
ఓవరాల్‌గా ఇప్పుడు టోర్నీలో ఉన్న జట్లు ఏవంటే?
1. చెన్నై సూపర్ కింగ్స్
2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
3. ముంబయి ఇండియన్స్
4. కోల్‌కతా నైట్‌రైడర్స్
5. సన్‌రైజర్స్ హైదరాబాద్
6. రాజస్థాన్ రాయల్స్
7. ఢిల్లీ క్యాపిటల్స్
8. పంజాబ్ కింగ్స్
9. గుజరాత్ టైటాన్స్
10. లక్నో సూపర్ జెయింట్స్.
IPL 2023 Latest News : బీసీసీఐ శుభవార్త.. ఇక ఐపీఎల్-2023లో స్టార్ ఆటగాళ్లుకు పండగే..
ఐపీఎల్ 2023 షెడ్యూల్ ఇదే..