Team India Records : ప్రపంచంలోనే తొలి జట్టుగా.. చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఎలా అంటే..?
ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2008లో ఐర్లాండ్‌పై కివీస్ 290 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే తాజా మ్యాచ్‌తో కివీస్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది.
శ్రీలంక 22 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి..
391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 22 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 73 పరుగులు మాత్రమే చేసింది. . భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు సాధించారు. లంక బ్యాటర్లలో నువానీడు ఫెర్నాండో 19 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ICC : రానున్న ఐదేళ్లలో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..
కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో..
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు యువ ఓపెనర్ శుబ్‌మాన్ గిల్ కూడా సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేశాడు.అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(33) పరుగులతో రాణించారు.