ICC : రానున్న ఐదేళ్లలో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..
Sakshi Education
రాబోయే ఐదేళ్ల కాలంలోనూ భారత పురుషుల క్రికెట్ జట్టు బిజీబిజీగా గడపనుంది.
2023 నుంచి 2027 వరకు భవిష్యత్ పర్యటనల కార్యక్రమాన్ని (ఎఫ్‌టీపీ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆగస్టు 17వ తేదీన (బుధవారం) విడుదల చేసింది.
➤ ఐసీసీలో శాశ్వత సభ్యత్వం ఉన్న 12 దేశాలు రాబోయే ఐదేళ్లలో 173 టెస్టులు, 281 వన్డేలు, 323 టి20లతో కలిపి మొత్తం 777 మ్యాచ్‌లు ఆడనున్నాయి.
➤ భారత జట్టు విషయానికొస్తే టీమిండియా 38 టెస్టులు, 42 వన్డేలు, 61 టి20 మ్యాచ్‌లతో కలిపి మొత్తం 141 మ్యాచ్‌ల్లో పోటీపడనుంది. అయితే ఈ ఐదేళ్లలో భారత్, పాకిస్తాన్ మధ్య ఒక్క ద్వైపాక్షిక సిరీస్ లేకపోవడం గమనార్హం. ఈ రెండు జట్లు ఐసీసీ టోర్నీలలోనే తలపడతాయి.
➤ ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ జట్లతో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లు ఆడుతుంది. ఆ్రస్టేలియాతో ఇప్పటివరకు నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ ఆడేది. 1991 తర్వాత మళ్లీ ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్టుల సిరీస్‌కు సిద్ధమైంది.
Published date : 18 Aug 2022 04:46PM