Virat Kohli Records : ప్రపంచ క్రికెట్‌లో చరిత్రలో ఏకైక ఆటగాడిగా కోహ్లి.. సాధించిన అరుదైన రికార్డులు ఇవే..
కాగా వన్డేల్లో విరాట్‌కు ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కింగ్ కోహ్లి పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
Virat Kohli Top Records : కోహ్లి కెరీర్‌లో ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఇవే.. ఎందుకంటే..?
కోహ్లి సాధించిన అరుదైన రికార్డులు ఇవే..
➤ శ్రీలంకపై విరాట్‌కు ఇది 10వ వన్డే సెంచరీ. తద్వారా ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా విరాట్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్‌తో కలిసి విరాట్ సమంగా ఉన్నాడు.
➤ ఆస్ట్రేలియాపై సచిన్ 9 సెంచరీలు చేయగా.. విరాట్ కూడా వెస్టిండీస్‌పై 9 సెంచరీలు చేశాడు. తాజా మ్యాచ్‌లో సెంచరీ చేసిన కింగ్ కోహ్లి(10).. సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.
➤ ఇక భారత గడ్డపై విరాట్‌కు ఇది 21 వన్డే సెంచరీ. దీంతో స్వదేశంలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో సెంచరీ చేసిన కింగ్ సచిన్‌ను అధిగిమించాడు.
Virat Kohli : ప్రతిష్టాత్మక అవార్డు బరిలో..విరాట్ కోహ్లి.. తొలిసారిగా..!
➤ అదేవిధంగా స్వదేశీ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో 6976 పరుగులతో సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత రికీ పాటింగ్ 5521 పరుగులతో రెండో స్థానంలో నిలవగా.. 5303 రన్స్‌తో కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు.
➤ అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 259 వన్డే ఇన్నింగ్స్‌లలో 12754 పరుగులు చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే(12650)ను కోహ్లి అధిగమించాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(18426) ఉండగా.. రెండో స్థానంలో శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర(14234)పరుగులతో ఉన్నాడు.
➤ రికార్డుల రారాజు కోహ్లి అంతర్జాతీయ వన్డేల్లో 50వ శతకం సాధించాడు. తద్వారా సచిన్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023 తొలి సెమీ ఫైనల్ సందర్భంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.
Cricket: ఇండియా నుంచి తొలిప్లేయర్ ... స్కై తాజా రికార్డు ఏంటో తెలుసా.?
The first time I met you in the Indian dressing room, you were pranked by other teammates into touching my feet. I couldn’t stop laughing that day. But soon, you touched my heart with your passion and skill. I am so happy that that young boy has grown into a ‘Virat’ player.
— Sachin Tendulkar (@sachin_rt) November 15, 2023
I… pic.twitter.com/KcdoPwgzkX