Skip to main content

Virat Kohli : ప్రతిష్టాత్మక అవార్డు బ‌రిలో..విరాట్‌ కోహ్లి.. తొలిసారిగా..!

2022, అక్టోబర్‌ నెలకుగానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి న‌వంబ‌ర్ 3వ తేదీన (గురువారం) ప్రకటించింది.
virat kohli Indian Cricketer
Virat Kohli

ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు షార్ట్‌లిస్ట్‌ చేసిన జాబితాలో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి,  దక్షిణాఫ్రికా క్రికెటర్‌ డేవిడ్‌ మిల్లర్‌, జింబాబ్వే ఆల్‌ రౌండర్‌ సికిందర్‌ రజాకు చోటు దక్కింది.

T20 World Cup Semi Final 2022 Teams : టీ20 ప్రపంచకప్ 2022లో సెమీస్‌ బెర్తులు ఆసక్తికరం.. గ్రూప్-1,2 లోని జ‌ట్లు..

అద్భుతమైన ఆట‌తీరుతో.. విరాట్‌ కోహ్లి
కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌-2022లో అర్ధసెంచరీలతో చెలరేగుతున్నాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 82(నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడిన కింగ్‌.. అనంతరం నెదర్లాండ్స్‌, బంగ్లదేశ్‌పై కూడా అర్ధసెంచరీలతో అదరగొట్టాడు. ఇక ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన విరాట్‌.. 220 పరుగులతో టోర్నీ టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. అదే విధంగా ఆక్టోబర్‌లో కోహ్లి 150.73 స్ట్రైక్‌ రేటుతో 205 పరుగులు సాధించాడు.

T20 World Cup 2022 : టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు వీరే.. ఇప్పటి వరకు ఈ రికార్డుల‌ను ఎవరూ

డేవిడ్‌ మిల్లర్ మాత్రం..

David Miller

డేవిడ్‌ మిల్లర్ అక్టోబ‌ర్ నెలలో భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 47 బంతుల్లోనే 106 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. అదే విధంగా  టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లోను 59 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. అక్టోబ‌ర్ నెలలో ఓవరాల్‌గా ఏడు ఇన్నింగ్స్‌లలో   మిల్లర్‌ 303 పరుగులు చేశాడు.

T20 World Cup 2022 : పెను సంచలనం.. ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ ఇదే..

భీకర ఫామ్‌లో.. సికిందర్‌ రజా

Sikandar Raza

ఈ జింబాబ్వే స్టార్‌ ఆల్‌ రౌండర్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్‌తోను బాల్‌తోను అదరగొడుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగులతో రజా తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అదే విధంగా స్కాట్లాండ్‌పై కూడా 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక పాకిస్తాన్‌పై జింబాబ్వే చారిత్రాత్మక విజయం సాధించడంలో రజా కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో రజా మూడు వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో కూడా రజా మూడు వికెట్లు సాధించాడు.

T20 World Cup 2022 Prize Money : టీ20 ప్రపంచకప్‌-2022 విజేత, రన్నరప్ టీమ్‌ల‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే..?

Published date : 03 Nov 2022 03:23PM

Photo Stories