Inspiration Story: టీం ఇండియా కెప్టెన్ నుంచి పోలీస్ అధికారిగా... రాజ్‌పాల్ సింగ్ ఎవరో తెలుసా..?
చదవండి: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్... త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్
2011లో భారత కెప్టెన్‌గా పనిచేసిన రాజ్‌పాల్ సింగ్.. ప్రస్తుతం మొహాలీ ట్రాఫిక్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. స్టేడియం మొయిన్ గేట్ వద్ద సెక్యూరిటీగా ఉన్న రాజ్‌పాల్ సింగ్.. తన సహచరులతో కలిసి ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకున్నాడు.
కాగా ఐపీఎల్ మ్యాచ్‌లే కాకుండా గత కొంత కాలంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో కూడా తన విధులు నిర్వహించినట్లు రాజ్‌పాల్ తెలిపాడు. స్టేడియం వద్ద పరిస్థితులను ఎలా కంట్రోల్ చేయాలో తనకు బాగా తెలుసని, ఇదంతా డ్యూటీలో భాగమని స్టార్‌స్పోర్ట్‌తో రాజ్‌పాల్ సింగ్ పేర్కొన్నాడు. కాగా రాజ్‌పాల్ మొట్టమొదటి కామన్వెల్త్ గేమ్స్ పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు నాయకత్వం వహించాడు.
చదవండి: నర్సింగ్ విద్యార్థులకు శుభవార్త... రూ.80 వేల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
అదే విధంగా 2011 ఆసియా పురుషుల హాకీ చాంపియన్స్ ట్రోఫీని అతడి సారథ్యంలోనే భారత్ సొంతం చేసుకుంది. ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి టైటిల్‌ను భారత జట్టు ముద్దాడింది.