Skip to main content

Jobs: న‌ర్సింగ్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌... రూ.80 వేల జీతంతో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే

న‌ర్సింగ్ పూర్తి చేసిన వారికి ఇదొక గుడ్ న్యూస్‌. కొంచెం క‌ష్ట‌ప‌డితే చాలు మొద‌టి నెల‌లోనే రూ.80 వేల జీతం తీసుకోవ‌చ్చు. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) భారీగా న‌ర్సింగ్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న 3055 ఖాళీల‌ను ఈ ప్రకటన ద్వారా భ‌ర్తీ చేయ‌నుంది. బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం కోర్సులు పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Nursing Jobs
Nursing Jobs

నర్సింగ్‌ ఆఫీసర్స్‌ రిక్రూట్‌మెంట్‌ కామన్‌ ఎలిజిబిలిటీ టెస్టు (ఎన్‌ఓఆర్‌సెట్‌)లో ప్రతిభ క‌న‌బ‌ర్చిన విద్యార్థులతో పోస్టుల‌ను భర్తీ చేస్తారు. ఒక్క‌సారి ఈ ప‌రీక్ష రాస్తే ఇందులో వ‌చ్చిన మార్కులు ఆరు నెల‌ల వ‌రకు, లేదా ఆ త‌ర్వాత ప‌రీక్ష వ‌ర‌కు చెల్లుతుంది. అంటే ఈ లోపు ఎయిమ్స్‌ల్లో కొత్త ఖాళీలు ఏర్పడితే ఈ స్కోరు ఆధారంగానే ఎంపికచేస్తారు. ప్రస్తుతం ఉన్న నియామకాలు భ‌ర్తీ చేసే సమయానికి ఖాళీలు పెరిగే అవకాశం ఉంది. మొత్తం పోస్టుల్లో 80 శాతం మహిళలకు కేటాయించారు. మిగిలిన 20 శాతం పురుషులతో నింపుతారు.

nursing


200 ప్ర‌శ్న‌లు... 3 గంట‌ల స‌మ‌యం 
ప‌రీక్ష మొత్తం 200 ప్ర‌శ్న‌లు ఉంటాయి. స‌మ‌యం 3 గంట‌లు. ఇందులో 180 ప్ర‌శ్న‌లు సబ్జెక్టుకు సంబంధించినవి, మిగిలిన 20 జనరల్‌ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచి వస్తాయి. జనరల్, ఈడబ్ల్యుఎస్‌ అభ్యర్థులు 50 శాతం, ఓబీసీలు 45, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులు సాధించాలి. దివ్యాంగుల‌కు కేటగిరీల వారీగా 5 శాతం సడలింపు వర్తిస్తుంది. 

చ‌ద‌వండి: ప‌రీక్ష లేకుండానే 70 వేల జీతంతో నేష‌న‌ల్ సోలార్ ఎన‌ర్జీలో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే​​​​​​​
లెవెల్‌ 7 ప్రకారం వేత‌నం

పరీక్షలో అర్హత సాధించిన అభ్య‌ర్థుల‌ మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఖాళీలను భ‌ర్తీ చేస్తారు. వీరిని కేంద్రప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వీరికి పే స్కేల్‌ లెవెల్‌ 7 ప్రకారం రూ.44,900 మూలవేతనం అందిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనంగా ఉంటాయి. అంటే మొదటి నెల నుంచే వీరు సుమారు రూ.80 వేల వేతనం అందుకోవచ్చు. దశలవారీ పదోన్నతులూ ఉంటాయి.

nursing


ఖాళీల వివరాలు ఇలా
బఠిండా 142, భోపాల్‌ 51, భువనేశ్వర్‌ 169, బీబీనగర్‌ 150, బిలాస్‌పూర్‌ 178, దియోఘర్‌ 100, గోరఖ్‌పూర్‌ 121, జోధ్‌పూర్‌ 300, కల్యాణి 24, మంగళగిరి 117, నాగ్‌పూర్‌ 87, రాయ్‌ బరేలీ 77, న్యూదిల్లీ 620, పట్నా 200, రాయ్‌పూర్‌ 150, రాజ్‌కోట్‌ 100, రిషికేష్‌ 289, జమ్మూ 180
అర్హత: బీఎస్సీ నర్సింగ్‌/ పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ లేదా జీఎన్‌ఎం తోపాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో రెండేళ్ల పని అనుభవం. 
వయసు: 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపులు వర్తిస్తాయి. 
ఆన్‌లైన్‌ దరఖాస్తులు:  మే 5వ తేదీ సాయంత్రం 5 గంట‌ల‌ వరకు 
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.3000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యుఎస్ అభ్య‌ర్థుల‌కు రూ.2400. దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు. 
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: జూన్‌ 3
వెబ్‌సైట్‌: https://aiimsexams.ac.in/

Published date : 20 Apr 2023 01:57PM
PDF

Photo Stories