Skip to main content

IPL 2023: ఐపీఎల్ 2023 రికార్డులివే.. 250 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా ధోని రికార్డు..

మహేంద్ర సింగ్‌ ధోని మంత్రజాలం ఐపీఎల్‌లో మరోసారి అద్భుతంగా పని చేసింది. తనకే సాధ్యమైనరీతిలో సాధారణ ఆటగాళ్లతోనే జట్టును నడిపించిన అతను ఐదో ట్రోఫీతో సగర్వంగా నిలిచాడు.
MS Dhoni

15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అక్కడక్కడా తడబడినా చివరకు సీఎస్‌కే గెలుపు సొంతం చేసుకుంది. మోహిత్‌ శర్మ వేసిన చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా, తొలి 4 బంతుల్లో అతను 3 పరుగులే ఇచ్చాడు. దాంతో గుజరాత్‌ గెలుస్తున్నట్లుగా అనిపించింది. అయితే తర్వాతి రెండు బంతులను జడేజా 6, 4గా మలచి సూపర్‌ కింగ్స్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు. వరుసగా రెండో ఏడాది చాంపియన్‌గా నిలవాలని భావించిన గుజరాత్‌ టైటాన్స్‌ చివరకు రన్నరప్‌గా సంతృప్తి చెందింది. సాధారణంగా 215 పరుగుల లక్ష్యం అసాధ్యంగా కనిపించినా.. వర్షం అంతరాయంతో ఓవర్లు తగ్గడం, చేతిలో 10 వికెట్లు ఉండటం కూడా చెన్నైకి మేలు చేసింది. చివరిదిగా భావిస్తున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లో ధోని తొలి బంతికే గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరగా..  ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అంబటి రాయుడు తన కెరీర్‌లో ఆరో టైటిల్‌తో ఘనమైన ముగింపునిచ్చాడు.  

IPL 2023 New Rules: ఐపీఎల్‌లో సంచ‌ల‌నం రేకెత్తించే కొత్త రూల్స్ ఇవే.. టాస్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే ఒక టీమ్‌‌‌‌‌‌‌‌, ఓడితే మరో టీమ్‌‌‌‌ రంగంలోకి..

☛ ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు. 2008 నుంచి మొదలుకొని ధోని వరుసగా 16 సీజన్లు ఆడాడు. 226 మ్యాచ్‌ల్లో అతను కెప్టెన్‌గా చేశాడు. రోహిత్‌ శర్మ (243), దినేశ్‌ కార్తీక్‌ (242), విరాట్‌ కోహ్లి (237), రవీంద్ర జడేజా (226) టాప్‌–5లో ఉన్నారు.  
☛ ఐపీఎల్‌–2023లో నమోదైన సెంచరీలు 12 . గత ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధికంగా 8 సెంచరీలు వచ్చాయి.  
☛ గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 37 సార్లు ఆయా జట్లు 200 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించాయి. గత సీజన్‌లో 18 సార్లు 200 అంతకంటే ఎక్కువ పరుగులు వచ్చాయి.  
☛  ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు చెందిన తుషార్‌ దేశ్‌పాండే నిలిచాడు. ఈ సీజన్‌లో తుషార్‌ 16 మ్యాచ్‌లు ఆడి 564 పరుగులు ఇచ్చి 21 వికెట్లు పడగొట్టాడు. గతంలో ఈ రికార్డు ప్రసిధ్‌ కృష్ణ (551 పరుగులు; 2022 సీజన్‌) పేరిట ఉంది. 

IPL 2023: 16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన రికార్డు...

ఆరెంజ్‌ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌) :
శుబ్‌మన్‌ గిల్‌ (890 పరుగులు; 17 మ్యాచ్‌లు) సెంచరీలు: 3, అర్ధ సెంచరీలు: 4 
ఐపీఎల్‌ టోర్నీలో ఆరెంజ్‌ క్యాప్‌ నెగ్గిన పిన్న వయస్కుడిగా గిల్‌ (23 ఏళ్ల 263 రోజులు) గుర్తింపు పొందాడు. 
ప్రైజ్‌మనీ: రూ. 15 లక్షలు 
పర్పుల్‌ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌) :  మొహమ్మద్‌ షమీ (28 వికెట్లు; 17 మ్యాచ్‌లు) 
ప్రైజ్‌మనీ: రూ. 15 లక్షలు  
మొత్తం ప్రైజ్‌మనీ: రూ. 46 కోట్ల 50 లక్షలు 
విజేత జట్టుకు: రూ. 20 కోట్లు 
రన్నరప్‌ జట్టుకు: రూ. 13 కోట్లు 
మూడో స్థానం: రూ. 7 కోట్లు 
(ముంబై ఇండియన్స్‌) 
నాలుగో స్థానం: రూ. 6 కోట్ల 50 లక్షలు (లక్నో సూపర్‌ జెయింట్స్‌) 

BCCI: భారత క్రికెట్‌ జట్టు కిట్‌ స్పాన్సర్‌గా అడిడాస్‌

Published date : 31 May 2023 07:52PM

Photo Stories