Skip to main content

BCCI: భారత క్రికెట్‌ జట్టు కిట్‌ స్పాన్సర్‌గా అడిడాస్‌

జర్మనీకి చెందిన ప్రముఖ క్రీడా ఉత్పాదనల సంస్థ అడిడాస్‌ భారత క్రికెట్‌ జట్టు కిట్‌ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
BCCI announce Adidas as new kit sponsor

ప్రస్తుత స్పాన్సర్‌ ‘కిల్లర్‌ జీన్స్‌’తో కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త స్పాన్సర్‌షిప్‌ ఇచ్చింది. దీనిపై బోర్డు కార్యదర్శి జై షా మాట్లాడుతూ ‘దేశంలో క్రికెట్‌ అభివృద్ధి అంచనాలను మించుతుంది. కాబట్టి ప్రపంచశ్రేణి సంస్థ మాతో జట్టు కట్టడంపై పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు’ అని అన్నారు.

Madrid Open: మాడ్రిడ్‌ ఓపెన్‌ టైటిల్‌ కైవసం చేసుకున్న సబలెంకా

జర్మన్‌ స్పోర్ట్స్‌ బ్రాండ్‌ అయిన అడిడాస్‌తో ఒప్పందం ఎన్నేళ్లు, ఎంత మొత్తానికి స్పాన్సర్‌షిప్‌ పొందిందనే వివరాలేవీ ఆయన వెల్లడించలేదు. విశ్వసనీయ వర్గాల ప్రకారం రూ.350 కోట్లతో అడిడాస్‌ కిట్‌ స్పాన్సర్‌షిప్‌ దక్కించుకున్నట్లు తెలిసింది. టీమిండియా వచ్చే నెల 7 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో తలపడుతుంది. ఆ జెర్సీలపై అడిడాస్‌ లోగో కనిపించనుంది. టీమ్‌ స్పానర్‌ బైజుస్‌ కూడా మారుతున్నట్లు తెలిసింది. ఈ నవంబర్‌ వరకు గడువున్నప్పటికీ సదరు సంస్థ ముందుగానే వైదొలగనుండటంతో త్వరలోనే బిడ్లను ఆహ్వానిస్తారు.

ISSF World Cup Baku 2023: రిథమ్‌ ప్రపంచ రికార్డు.. అయినా పతకానికి దూరం

Published date : 24 May 2023 11:35AM

Photo Stories