Madrid Open: మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న సబలెంకా
Sakshi Education
మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను ఓడించి బెలారస్ స్టార్ సబలెంకా మాడ్రిడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీలో రెండోసారి చాంపియన్‌గా నిలిచింది.
2021లో ఈ టైటిల్‌ను నెగ్గిన రెండో ర్యాంకర్ సబలెంకా ఈ ఏడాది ఫైనల్లో 6–3, 3–6, 6–3తో స్వియాటెక్‌పై గెలిచింది. సబలెంకా కెరీర్‌లో ఇది 12వ సింగిల్స్ టైటిల్. విజేతగా నిలిచిన సబలెంకాకు 11,05,265 యూరోల (రూ. 10 కోట్ల 12 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి.
Published date : 08 May 2023 04:58PM