Skip to main content

ISSF World Cup Baku 2023: రిథమ్‌ ప్రపంచ రికార్డు.. అయినా పతకానికి దూరం

ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్‌ రిథమ్‌ సాంగ్వాన్‌ కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది.
Shooter Rhythm

అజర్‌బైజాన్‌లోని బాకులో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో రిథమ్‌ 595 పాయింట్లు స్కోరు సాధించి రికార్డును నమోదు చేసింది. అయితే ఈ పోటీల క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో ఆమె ఈ కొత్త ఘనతను ప్రదర్శించింది. రికార్డు స్కోరుతో ఫైనల్‌ చేరిన రిథమ్‌ అసలు సమరంలో మాత్రం విఫలమైంది. సత్తా చాటలేకపోయిన ఆమె చివరగా ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదే ఈవెంట్‌ క్వాలిఫయింగ్‌ ఇతర భారత షూటర్లు ఇషాసింగ్, మను భాకర్‌ వరుసగా 13వ, 27వ స్థానాల్లో నిలిచి ఆరంభంలోనే నిష్క్రమించారు. పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో కూడా భారత షూటర్లెవరూ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (09-15 ఏప్రిల్ 2023)

Published date : 15 May 2023 11:56AM

Photo Stories