IPL 2023 Latest News : బీసీసీఐ శుభవార్త.. ఇక ఐపీఎల్-2023లో స్టార్ ఆటగాళ్లుకు పండగే..
ఈ విషయాన్ని ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ధ్రువీకరించినట్లు వెల్లడించింది.‘‘మా ఆటగాళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారు. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లు మార్చి 30 నుంచి జట్లతో చేరగలరు’’ అని సీఏ పేర్కొనగా.. ఈసీబీ సైతం తమ ఆటగాళ్లంతా అందుబాటులో ఉంటారని తెలిపింది. అయితే, ఐపీఎల్ వేలంలో హాట్ ఫేవరెట్‌గా భావిస్తున్న కామెరూన్ గ్రీన్ అందుబాటులోకి రావడంతో అతడి కోసం ఫ్రాంఛైజీల మధ్య పోటీ తీవ్రతరం కావడం ఖాయం. అదే విధంగా స్టోక్స్ విషయంలోనూ పోటీ తప్పకపోవచ్చు. కానీ ఆయా జట్ల టెస్టు సిరీస్‌ల నేపథ్యంలో వీరిద్దరు ప్లే ఆఫ్స్‌కు దూరమయ్యే అవకాశం లేకపోలేదు. మార్చి ఆఖర్లో లేదంటే ఏప్రిల్ ఆరంభంలో ఐపీఎల్- 2023 ఆరంభం కానున్నట్లు తెలుస్తోంది.
IPL 2023 : ఐపీఎల్-2023 వేలం.. ప్రముఖ ప్లేయర్లు ఇవే.. అత్యధికంగా..
వేలంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు వీళ్లే..
హ్యారీ బ్రూక్, జో రూట్, బెన్ స్టోక్స్, సామ్ కరన్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ, టామ్ బాంటన్, ఫిలిప్ సాల్ట్, క్రిస్ జోర్డాన్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, విల్ స్మీడ్, జాసన్ రాయ్, జార్జ్ గార్టన్, జామీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, రిచర్డ్ గ్లీసన్, ల్యూక్ వుడ్, టామ్ కరన్, టైమల్ మిల్స్, డేవిడ్ పేన్, రెహాన్ అహ్మద్, జోర్డాన్ థాంప్సన్, క్రిస్టోఫర్ బెంజమిన్, థామస్ హెల్మ్, జేమ్స్ ఫుల్లర్, బెన్నీ హోవెల్
ఆస్ట్రేలియా ఆటగాళ్లు వీళ్లే..
కామెరూన్ గ్రీన్, పీటర్ హాట్జోగ్లో, లాన్స్ మోరిస్, జాషువా ఫిలిప్, జై రిచర్డ్‌సన్, రిలే మెరెడిత్, హేడెన్ కెర్, జాక్ ప్రెస్‌విడ్జ్, బెన్ మెక్‌డెర్మోట్, బెన్ డ్వార్షూయిస్, బిల్లీ స్టాన్‌లేక్, ట్రావిస్ హెడ్, నాథన్ మెక్‌అంపాస్ , సీన్ అబాట్, క్రిస్ లిన్, డార్సీ షార్ట్, నాథన్ కౌల్టర్-నైల్, ఆండ్రూ టై, మోయిసెస్ హెన్రిక్స్
T20 World Cup 2022 Prize Money : టీ20 ప్రపంచకప్-2022 విజేత, రన్నరప్ టీమ్‌లకు ప్రైజ్‌మనీ ఎంతంటే..?
వీళ్లు ఏప్రిల్ 8 తర్వాతేనే..
ఇక సౌతాఫ్రికా క్రికెట్, వెస్టిండీస్ బోర్డులు తమ క్రికెటర్లు మార్చి 29 నుంచి అందుబాటులో ఉంటారని చెప్పగా.. శ్రీలంక బోర్డు మాత్రం ఏప్రిల్ 8 తర్వాతే తమ ఆటగాళ్లు జట్లతో కలవగలరని పేర్కొంది.
Virat Kohli Top Records : కోహ్లి కెరీర్‌లో ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఇవే.. ఎందుకంటే..?
ఎవరెవరు ఎప్పుడు అందుబాటులో ఉంటారంటే..?
☛ బంగ్లాదేశ్ ఆటగాళ్లు- ఐర్లాండ్‌తో సిరీస్‌కు ఎంపికైన వాళ్లు ఏప్రిల్ 8- మే 1 నుంచి
☛ న్యూజిలాండ్ క్రికెటర్లు- అందరూ పూర్తి స్థాయిలో అందుబాటులోకి
☛ అఫ్గనిస్తాన్- ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన వాళ్లు మార్చి 30 తర్వాత
☛ ఐర్లాండ్- - మే 5- 15 మధ్య అందుబాటులో ఉండరు
☛ జింబాబ్వే- పూర్తి స్థాయిలో అందరూ అందుబాటులో ఉంటారు.