Skip to main content

IPL 2023 Mini Auction Latest News : ఐపీఎల్ 2023 వేలంలో అత్యధికంగా ధ‌ర ప‌లికిన ఆట‌గాళ్లు వీరే..

2023 ఐపీఎల్‌ సీజన్‌ కోసం తమ జట్లను మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో... ఇవాళ జరగనున్న మినీ వేలంలో 10 ఫ్రాంచైజీ జట్లు పాల్గొననున్నాయి. ఈ ఏడాది టోర్నీ ముగిసిన తర్వాత పలు ఫ్రాంచైజీలు కొందరు ఆటగాళ్లను వదిలించుకున్నాయి.
IPL
IPL Latest News

ఫలితంగా ఏర్పడిన 87 ఖాళీలను భర్తీ చేసుకునేందుకు మినీ వేలం ఏర్పాటు చేశారు. ఈ వేలంలో మొత్తం 405 మంది క్రికెటర్లు బరిలో ఉన్నారు. ఇందులో 273 మంది భారత క్రికెటర్లు కాగా... 132 మంది విదేశీ క్రికెటర్లు. 87 బెర్త్‌లలో గరిష్టంగా 30 మంది విదేశీ క్రికెటర్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయాలి.

IPL 2023 Latest News : బీసీసీఐ శుభవార్త.. ఇక ఐపీఎల్‌-2023లో స్టార్ ఆటగాళ్లుకు పండ‌గే..

విదేశీ క్రికెటర్లలో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్లు బెన్‌ స్టోక్స్, స్యామ్‌ కరన్‌...బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌... ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌లపై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచిన స్యామ్‌ కరన్‌ గాయం కారణంగా ఈ సంవత్సరం ఐపీఎల్‌ టోర్నీకి దూరంగా ఉన్నాడు. స్యామ్‌ కరన్‌ కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలో నమోదు చేసుకున్నాడు. ఇటీవల టి20 ప్రపంచకప్‌లో విశేషంగా రాణించిన జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజా కూడా ఫ్రాంచైజీలను ఆకర్షించనున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌తోపాటు ఏకంగా పదిమంది ఆటగాళ్లను వదిలించుకుంది. వారివద్ద అత్యధికంగా రూ. 42.25 కోట్లు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి ఏడుగురు క్రికెటర్లు... ఆంధ్ర నుంచి పది మంది క్రికెటర్లు ఈ వేలంలో ఉన్నారు.

Virat Kohli Top Records : కోహ్లి కెరీర్‌లో ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఇవే.. ఎందుకంటే..?

►హ్యారీ బ్రూక్‌- ఎస్‌ఆర్‌హెచ్‌(రూ. 13.25 కోట్లు)
► మయాంక్‌ అగర్వాల్‌- ఎస్‌ఆర్‌హెచ్‌( రూ. 8.25 కోట్లు)
► కేన్‌ విలియమ్సన్‌- గుజరాత్‌ లయన్స్‌(రూ. 2 కోట్లు కనీస ధర)
► జో రూట్‌(కనీస ధర 50 లక్షలు)- అమ్ముడుపోలేదు
► అజింక్యా రహానే(కనీస ధర 50 లక్షలు)-  సీఎస్‌కే(రూ. 50 లక్షలు)

T20 World Cup 2022 : టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు వీరే.. ఇప్పటి వరకు ఈ రికార్డుల‌ను ఎవరూ

Published date : 23 Dec 2022 03:36PM

Photo Stories