Skip to main content

ICC Cricket World Cup 2023: అవార్డు విజేతల పూర్తి జాబితా ఇదే!

నవంబర్ 19, 2023న ముగిసిన 2023 ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.
ICC World Cup 2023 Awards List,

ఈ టోర్నమెంట్, క్రికెట్ ప్రపంచ కప్ 13వ ఎడిషన్. తొలి సెమీఫైనల్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడగా, భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండవ సెమీ-ఫైనల్ లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాపై  విజయం సాధించి  ప్రపంచ కప్ 2023 ఫైనల్‌కు చేరింది. అంతిమంగా, ODI క్రికెట్ ప్రపంచ కప్‌లో టైటిల్‌ను ఫైనల్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

ప్రపంచ కప్ 2023 అవార్డు విజేతలు:

  1. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ - విరాట్ కోహ్లీ (765 పరుగులు, 1 వికెట్, 5 క్యాచ్‌లు)
  2. ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ - ట్రావిస్ హెడ్ (137 పరుగులు, 1 క్యాచ్)
  3. అత్యధిక పరుగులు - విరాట్ కోహ్లీ (11 ఇన్నింగ్స్‌ల్లో 765 పరుగులు)
  4. అత్యధిక స్కోరు - గ్లెన్ మాక్స్‌వెల్ (ముంబైలో 201* వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్)
  5. అత్యధిక వందలు - క్వింటన్ డి కాక్ (4 వందలు)
  6. అత్యధిక అర్ధశతకాలు - విరాట్ కోహ్లీ (6 అర్ధశతకాలు)
  7. అత్యధిక వికెట్లు - మహ్మద్ షమీ (7 ఇన్నింగ్స్‌ల్లో 24 వికెట్లు)
  8. ఉత్తమ గణాంకాలు - మహ్మద్ షమీ (7/57 vs న్యూజిలాండ్ ముంబైలో)
  9. అత్యధిక సిక్సర్లు - రోహిత్ శర్మ (31 సిక్సర్లు)
  10. అత్యధిక క్యాచ్‌లు - డారిల్ మిచెల్ (11 క్యాచ్‌లు)
  11. వికెట్ కీపర్ ద్వారా అత్యధిక అవుట్‌లు - క్వింటన్ డి కాక్ (20 అవుట్‌లు)
  12. అత్యధిక స్ట్రైకర్ రేట్ - గ్లెన్ మాక్స్‌వెల్ (150.37)

ఇతర విశేషాలు
►ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా భారత స్టార్‌ విరాట్‌ కోహ్లి నిలిచాడు. కోహ్లి 11 మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు,  6 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 765 పరుగులు సాధించాడు. 
 
►ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భారత పేసర్‌ మొహమ్మద్‌ షమీ నిలిచాడు.  షమీ 7 మ్యాచ్‌లు ఆడి మొత్తం  24 వికెట్లు పడగొట్టాడు. షమీ మొత్తం 48.5 ఓవర్లు వేసి 257 పరుగులు ఇచ్చాడు. 
 
►మొత్తం ప్రపంచకప్‌ టోర్నీలలో అత్యధిక టీమ్‌ స్కోరు ఈ ప్రపంచకప్‌లోనే నమోదైంది. శ్రీలంకతో న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్లకు  428 పరుగులు సాధించింది.  

►ధర్మశాలలో ఆ్రస్టేలియా (388 ఆలౌట్‌; 49.2 ఓవర్లలో), న్యూజిలాండ్‌ (50 ఓవర్లలో 383/9) జట్ల మధ్య  జరిగిన మ్యాచ్‌లో మొత్తం 771 పరుగులు వచ్చాయి. ప్రపంచకప్‌ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధికం.  
 
►ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత నమోదు చేసిన బ్యాటర్‌గా ఆస్ట్రేలియా క్రికెటర్‌ మ్యాక్స్‌వెల్‌ నిలిచాడు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ (128 బంతుల్లో 201 నాటౌట్‌; 21 ఫోర్లు, 10 సిక్స్‌లు) అజేయ డబుల్‌ సెంచరీ సాధించాడు.  
 
►ఈ ప్రపంచకప్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా భారత పేసర్‌ మొహమ్మద్‌ షమీ నిలిచాడు. న్యూజిలాండ్‌తో ముంబైలో జరిగిన సెమీఫైనల్లో షమీ 57 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు.  
 
►ఈ ప్రపంచకప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 400 అంతకంటే ఎక్కువ స్కోర్లు మూడుసార్లు నమోదయ్యాయి. శ్రీలంకపై దక్షిణాఫ్రికా (428/5), నెదర్లాండ్స్‌పై భారత్‌ (410/4), పాకిస్తాన్‌పై న్యూజిలాండ్‌ (401/6) సాధించాయి. 

►వన్డే వరల్డ్‌కప్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద  టోర్నమెంట్‌’ అవార్డు గెల్చుకున్న మూడో భారతీయ క్రికెటర్‌గా విరాట్‌ కోహ్లి గుర్తింపు పొందాడు. గతంలో సచిన్‌ టెండూల్కర్‌ (2003లో), యువరాజ్‌ సింగ్‌ (2011లో) ఈ ఘనత సాధించారు.

Published date : 21 Nov 2023 11:17AM

Photo Stories